విరూపాక్ష తర్వాత తేజ్ సంచలనం.. క్లైమాక్స్‌తో బాక్సాఫీస్ షేక్?

Amruth kumar
మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్ తన పేరు మార్చుకున్న తర్వాత నటిస్తున్న మొట్టమొదటి భారీ బడ్జెట్ చిత్రం 'సంబరాల ఏటి గట్టు' (Sambarala Yeti Gattu). 'విరూపాక్ష' వంటి సంచలన విజయం తర్వాత తేజ్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం మేకర్స్ చేస్తున్న ఖర్చు వింటే టాలీవుడ్ వర్గాలు షాక్ అవుతున్నాయి. కేవలం క్లైమాక్స్ ఎపిసోడ్ కోసమే ఏకంగా 20 కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారట!సాధారణంగా ఒక మీడియం రేంజ్ సినిమా బడ్జెట్ మొత్తం 20 నుండి 30 కోట్లు ఉంటుంది. కానీ, సాయి దుర్గా తేజ్ సినిమాలో కేవలం క్లైమాక్స్ కోసం ఇంత భారీ మొత్తాన్ని వెచ్చించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.ఈ క్లైమాక్స్ కోసం ఒక ఊరి సెట్‌ను అత్యంత భారీగా రీ-క్రియేట్ చేశారట. సుమారు 20 నిమిషాల పాటు సాగే ఈ యాక్షన్ ఎపిసోడ్ ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయం అని మేకర్స్ నమ్ముతున్నారు. అంతర్జాతీయ స్థాయి ఫైట్ మాస్టర్ల పర్యవేక్షణలో ఈ ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కోసం కూడా కోట్లు ఖర్చు చేస్తున్నారట.



కన్నడ డైరెక్టర్ రోహిత్ పదకి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో సాయి దుర్గా తేజ్ ఒక పవర్‌ఫుల్ రోల్‌లో కనిపిస్తున్నారు. 'సంబరాల ఏటి గట్టు' అనే పేరు వినడానికి క్లాస్‌గా ఉన్నా, సినిమాలో కంటెంట్ మాత్రం పక్కా ఊరమాస్‌గా ఉంటుందని తెలుస్తోంది.హనుమాన్ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత ప్రతిష్టాత్మకగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా కోసం సాయి దుర్గా తేజ్ తన బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చేశారు. గడ్డం, మాసిపోయిన బట్టలు, ఆ కళ్ళల్లో ఇంటెన్సిటీ చూస్తుంటే.. 'రంగస్థలం'లో చిట్టిబాబును మించిన పర్ఫార్మెన్స్ చూడబోతున్నామా? అనిపిస్తోంది. 'విరూపాక్ష'తో హారర్ థ్రిల్లర్ జోనర్‌లో హిట్ కొట్టిన తేజ్, ఇప్పుడు పీరియడ్ యాక్షన్ డ్రామాతో బాక్సాఫీస్‌పై దండయాత్రకు సిద్ధమయ్యారు.



ఈ 20 కోట్ల క్లైమాక్స్ వార్త బయటకు రాగానే మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. "మెగా హీరోలంటే ఆ మాత్రం ఉండాల్సిందే.. స్క్రీన్ మీద విజువల్స్ పీక్స్‌లో ఉంటాయి" అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ రేసులో ఈ సినిమాను నిలబెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ లేదా ఫస్ట్ గ్లింప్స్ కోసం ఆడియన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.సాయి దుర్గా తేజ్ కెరీర్‌లోనే ఇది అత్యంత కాస్ట్లీ మూవీ. క్లైమాక్స్ కోసం ఇంత ఖర్చు చేస్తున్నారంటే, ఇక సినిమా రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: