సంజూ శాంసన్ పై స్టార్ హీరో ప్రశంసలు..!
మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 195 పరుగులు భారత్ ముందు ఉంచింది. సంజూ శాంసన్ 50 బంతులలో 12 ఫోర్లు 4 సిక్సర్లతో 97 పరుగులు చేసి టీమ్ ఇండియాకు విజయాన్ని అందించారు. అలా తన ఆట తీరుతో మెప్పించిన సంజూ ఆటకి సైతం అభిమానులు మంత్రముగ్ధులయ్యారు. సంజూ ఆడిన తీరు చూస్తే క్రికెట్ అభిమానులే కాదు సినీ దిగ్గజాలు సైతం ముగ్ధులుతున్నారు. తాజాగా మలయాళంలో స్టార్ హీరో గా పేరు సంపాదించిన మోహన్ లాల్ సంజూ పైన ప్రశంసలు కురిపించారు.
సంజూ గురించి ట్విట్టర్ చేస్తూ తన అద్భుతమైన ఆటతో ఇంతటి అద్భుతమైన ఫామ్ లో ఉండడం చూసి చాలా ఆనందంగా ఉంది. ఇది నిజంగా ఒక మాస్టర్ ఫుల్ ఇన్నింగ్స్ అంటూ ఈ ఆటలో అతనిలోని వ్యక్తిత్వాన్ని అద్భుతమైన ప్రతిభ చాటుతోంది. అంటూ మోహన్‌లాల్ తన ట్విట్టర్ నుంచి తెలియజేశారు. సంజూ శాంసన్ కేవలం రన్స్ చేయడమే కాకుండా జట్టు క్లిష్టమైన పరిస్థితులలో కూడా ఆదుకున్న తీరు అమోఘం అంటూ ప్రశంసించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి మోహన్ లాల్ ట్విట్ వైరల్ గా మారింది. మోహన్‌లాల్ కూడా తన అద్భుతమైన సినిమాలతో అటు తెలుగు ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తున్నారు.