విజయ్ కి ఇప్పటికే రెండు పెళ్లిళ్లు జరిగాయా.. సంగీత కంటే ముందే.. 28 ఏళ్ల తర్వాత బయటపడ్డ రహస్యం.?

Pandrala Sravanthi
ఏంటి విజయ్ కి రెండు పెళ్లిళ్లు జరిగాయా..సంగీత కంటే ముందే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా.. ఇంతకీ విజయ్ రెండో పెళ్లి విషయం ఏంటి.. 28 ఏళ్ల తర్వాత బయటపడ్డ రహస్యం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. విజయ్ దళపతి తమిళనాడులో ఫేమస్ హీరో.. అంతే కాదు సౌత్ లో క్రేజ్ ఉన్న హీరోలలో ఈయన కూడా ఒకరు. అయితే అలాంటి విజయ్ దళపతి రాజకీయాల్లో రాణిస్తున్న వేళ ఆయన భార్య విడాకులు ప్రకటించి పెద్ద షాక్ ఇచ్చింది.విజయ్ మరో నటితో అక్రమ సంబంధం లో ఉండడం వల్లే నేను అతనికి విడాకులు ఇస్తున్నానని ఒక బలమైన కారణం చెప్పి ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లై చేసినట్టు తెలుస్తుంది. అయితే విడాకులు అప్లై చేయడంతో మరో షాకింగ్ విషయం కూడా బయటపడింది.అదేంటంటే విజయ్ రెండు సార్లు పెళ్లి చేసుకున్నాడు అనే విషయం.


 అయితే సంగీత విడాకులకు సంబంధించి అప్లై చేసిన సమయంలో పెళ్లి జరిగిన సంవత్సరాన్ని, డేట్ ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలా పెళ్లి జరిగిన సంవత్సరాన్ని మెన్షన్ చేస్తూ 1998 అని అందులో రాయడంతో చాలామంది షాక్ అవుతున్నారు. ఎందుకంటే విజయ్ సంగీతలకు 1999 ఆగస్టు 25న చెన్నైలోని  రాజా ముత్తయ్య మండపంలో గ్రాండ్ గా జరిగింది.కానీ సంగీత మాత్రం తన పెళ్లి జరిగిన సంవత్సరాన్ని 1998 జులై 10న యునైటెడ్ కింగ్డమ్ లో జరిగినట్టు రిజిస్టర్ చేసింది. దీంతో ఇదేంటి విజయ్ సంగీతల పెళ్లి 1999లో జరిగింది కదా.. మరి సంగీత మాత్రం రిజిస్టర్లో 1998 జూలై 10న ఎందుకు నమోదు చేసిందని చాలామంది షాక్ అయిపోతున్నారు. అయితే నిజానికి విజయ్ సంగీతల పెళ్లి రెండుసార్లు జరిగిందట.అయితే సంగీత పేరెంట్స్ లండన్ లో సెటిల్ అయ్యారు.అందుకే సంగీత కుటుంబ సభ్యుల సమక్షంలో మొదట యూకే లో విజయ్ సంగీతల పెళ్లి జరిగింది.


 ఆ తర్వాత 1999లో అంటే ఒక సంవత్సరం తర్వాత మళ్లీ వీరి పెళ్లి చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే చెన్నైలో జరిగిన పెళ్లి మాత్రమే ఇప్పటివరకు అభిమానులకు తెలుసు. కానీ 1998లో జరిగిన విషయం ఎవరికీ తెలియదు.అలా వీరి పెళ్లి రెండుసార్లు జరిగిందట.అయితే లండన్ లో జరిగిన పెళ్లిని విజయ్ దళపతి సీక్రెట్ గా ఉంచడానికి కారణం అప్పట్లో ఆయన మార్కెట్ దెబ్బతింటుంది అనేనట. ఎందుకంటే గతంలో హీరోలకు పెళ్లి అయితే మార్కెట్ లో వారి ఇమేజ్ దెబ్బ తినేది.అందుకే చాలామంది ఇలా పెళ్లి విషయాలను రహస్యంగా ఉంచేవారు. అలాగే లండన్ లో ఉన్న సంగీత కుటుంబ సభ్యుల కోసం లండన్ లో చట్టబద్దంగా పెళ్లి చేసుకున్నారు అని తెలుస్తుంది. ఇలా విజయ్ సంగీతల పెళ్లి రెండుసార్లు జరిగిందట. అయితే 28 సంవత్సరాల తర్వాత విజయ్ సంగీత విడాకుల మ్యాటర్ బయటకు రావడంతో ఈ విషయం బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: