విజయ్ సంగీత విడాకులు ..ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వీరికి సంబంధించిన విడాకుల పోస్టులే కనిపిస్తున్నాయి. ఇప్పటికే విజయ్ సంగీతల విడాకులకు కారణం త్రిష అంటూ సోషల్ మీడియాలో త్రిషపై విజయ్ అభిమానులు దుమ్మెత్తి పోస్తున్న వేళ విజయ్ భార్య సంగీత గురించి విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ మాట్లాడిన మాటలు సామాజిక మధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.నా మనవడు మనవరాలు అలా మారడానికి కారణం నా కోడలు సంగీతనే అంటూ చంద్రశేఖర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. మరి ఇంతకీ కోడలు సంగీతను ఉద్దేశించి చంద్రశేఖర్ చేసిన కామెంట్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
చంద్రశేఖర్ ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా కోడలు నా కొడుకు విజయ్ పై ఎప్పుడు ఓ కన్నేసి ఉంచుతుంది. వాడిపై నిఘా పెడుతుంది.వాడు ఏదైనా చేస్తే విమర్శించే వారిలో మొదట నా కోడలే ఉంటుంది. ఏ విషయంలో అయినా పరిణీతితో ఆలోచించి కచ్చితత్వంతో ఉంటుంది. విజయ్ కొన్ని విషయాల్లో ఎవరి మాట వినడు. కానీ సంగీత మాటకు మాత్రం విలువ ఇస్తాడు.ఆమె అభిప్రాయాన్ని గౌరవిస్తాడు. అలాగే నా మనవడు, మనవరాలు ఇంత క్రమశిక్షణా బద్దంగా పరిణితి తో ఉంటున్నారంటే దానికి కారణం నా కోడలు సంగీతనే. నా కోడలు సంగీత పిల్లల్ని చాలా క్రమశిక్షణతో పెంచుతుంది. వాళ్ల ఎదుగుదలకు కారణం సంగీతనే ఆ క్రెడిట్ మొత్తం నా కోడలకే దక్కుతుంది.
అలాగే సంగీత పిల్లలకి సంబంధించిన విషయంలో అస్సలు రాజీపడదు. వారికి ఇష్టమైన తిండి తినిపించడం నుండి వారికి ఇష్టమైన చదువులు చదివించడం వరకు ప్రతి ఒక్కటి దగ్గరుండి చూసుకుంటుంది ఎందులోనూ తగ్గదు. ఓ పక్క భర్తను మరోపక్క పిల్లలకు సంబంధించిన విషయాలు ఇంకో పక్క ఇంటిని చక్కదిద్దుతూ అన్ని పనులు చూసుకుంటుంది అంటూ కోడలు సంగీతపై విజయ్ తండ్రి చంద్రశేఖర్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అవుతుంది. అయితే విజయ్ తండ్రి చంద్రశేఖర్ మాట్లాడిన మాటలు ఇప్పటివైతే కావు. గతంలో ఈయన మాట్లాడిన మాటలు తాజాగా విజయ్ సంగీత విడాకుల వేళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.