హరీష్‌ను పవన్ కొట్టారా? ‘ఉస్తాద్’ సెట్స్‌లో అసలు ఏం జరిగింది!

Amruth kumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ అంటేనే ఒక వైబ్రేషన్. 'గబ్బర్ సింగ్'తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ జోడీ, ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh) తో మరోసారి రచ్చ చేయడానికి సిద్ధమైంది. అయితే, ఇటీవల సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హల్చల్ చేస్తోంది.. అదే "హరీష్ శంకర్‌ను పవన్ కళ్యాణ్ కొట్టారు" అనే వార్త. ఈ హెడ్ లైన్ చూడగానే అభిమానులు షాక్ అయ్యారు. కానీ, దీని వెనుక ఉన్న అసలు విషయం తెలిస్తే మీరు నవ్వకుండా ఉండలేరు.



ఈ సంఘటన 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ సమయంలో ఒక సీన్ చిత్రీకరిస్తుండగా జరిగింది.సినిమాలో ఒక ఎమోషనల్ సన్నివేశం ఉంది. ఒక పెద్దాయన వచ్చి పవన్ కళ్యాణ్‌కు దండం పెట్టి తన బాధ చెప్పుకోవాలి. అప్పుడు పవన్ ఆ చేతులను పట్టుకుని, "పెద్దవారు మీరు నాకు దండం పెట్టకండి.. నేను మీకు ఉన్నాను" అని ధైర్యం చెప్పాలి. షూటింగ్‌లో యాక్షన్ చెప్పగానే, అవతలి వ్యక్తి దండం పెట్టడం.. వెంటనే పవన్ కళ్యాణ్ కూడా రిఫ్లెక్స్ లో ఆయనకు ప్రతి నమస్కారం (దండం) పెట్టేశారు. డైరెక్టర్ హరీష్ శంకర్ వెంటనే 'కట్' చెప్పి పవన్ దగ్గరకు వెళ్లారు.



పవన్ దండం పెట్టడం చూసి హరీష్ శంకర్ నవ్వేస్తూ.. "సార్, సీన్ లో మీరు ఆయన దండం ఆపాలి.. మీరు పెట్టకూడదు" అని గుర్తు చేశారట. దానికి పవన్ నవ్వుతూ.. "సారీ హరీష్.. రాజకీయాల్లో ఉండి అందరికీ దండం పెట్టడం అలవాటైపోయింది. ఇక్కడ కూడా అదే రిపీట్ చేశాను" అని సరదాగా అన్నారట.ఈ విషయం గురించి పవన్‌ను టీమ్ సభ్యులు ఆటపట్టిస్తుంటే, ఆయన నవ్వుతూ హరీష్ భుజంపై సరదాగా కొట్టారు. ఆ నవ్వుతూ కొట్టిన ఫోటోను చూసి కొందరు కావాలని "పవన్ కొట్టారు" అంటూ క్లిక్ బైట్ వార్తలు ప్రచారం చేశారు.



ఇదే ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ మరో ముఖ్యమైన విషయం చెప్పారు.సినిమాలో ఏ రాజకీయ పార్టీని లేదా వ్యక్తిని టార్గెట్ చేయకూడదని పవన్ కళ్యాణ్ ముందే స్పష్టంగా చెప్పారట.సినిమా వేరు.. రాజకీయం వేరు: "సినిమా అనేది అందరినీ అలరించడానికి ఉండాలి.. పవన్ కళ్యాణ్‌కు అన్ని పార్టీల్లోనూ అభిమానులు ఉంటారు.. అందుకే కేవలం పవర్ ఫుల్ డైలాగ్స్ తప్ప, పొలిటికల్ సెటైర్లు ఉండవు" అని హరీష్ క్లారిటీ ఇచ్చారు.రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ, నటుడు ప్రకాష్ రాజ్‌తో పవన్ ఎంతో ప్రొఫెషనల్ గా కలిసి నటించారని హరీష్ కొనియాడారు.



ఈ సినిమాను మార్చి 26, 2026న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ మాస్ ఆడియన్స్‌ను ఊపేస్తున్నాయి. హరీష్ శంకర్ మార్క్ డైలాగులు, పవన్ కళ్యాణ్ స్వాగ్ కలిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం.'ఉస్తాద్' అప్‌డేట్స్‌తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. హరీష్-పవన్ ల మధ్య ఉన్నది గొడవ కాదు.. అదొక అన్యోన్యమైన 'గురు-శిష్యుల' (లేదా అభిమాన దర్శకుడి) బంధం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: