సొంత ఊరికోసం.. సంచలన నిర్ణయం తీసుకున్న రౌడీ హీరో..!
తన సొంత ఊరితో తనకి చాలా ఎమోషనల్ బాండింగ్ ఉందని ఊరిలో ఇల్లు కట్టుకోవాలని మా నాన్న కళకనే వారు. అందుకే ఇప్పుడు ఆ కళ నెరవేర్చాను నా వివాహం జరిగింది ,అదే సమయంలో ఇల్లు కూడా పూర్తి కావడం చాలా ఆనందంగా ఉందంటూ తెలియజేశారు. అలాగే గ్రామ అభివృద్ధి పైన విజయ్ మాట్లాడుతూ ఇకపై ఊరికి రెగ్యులర్గా వస్తానని తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ వివాహం కూడా గ్రామస్తులందరి సమక్షంలోనే చేస్తానంటూ మాట ఇచ్చారు.
అలాగే సామాజిక బాధ్యతగా తాను దేవరకొండ ఫౌండేషన్ ద్వారా నియోజవర్గంలోని 44 ప్రభుత్వ పాఠశాలలో చదివి 9, 10 వ తరగతి విద్యార్థులకు స్కాలర్షిప్ అందిస్తానంటూ తెలియజేశారు. ముఖ్యంగా మెరిట్ స్టూడెంట్స్ కి ఆర్థికంగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు విజయ్ దేవరకొండ. వివాహం అనంతరం తన సొంత ఊరికి వచ్చి ఇలాంటి గొప్ప కానుక ప్రకటించడంతో అటు విజయ్ అభిమానులు,నేటిజన్స్ సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. విరోష్ జంట మార్చి 4వ తేదీన హైదరాబాదులో చాలా గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెప్షన్ కోసం సిద్ధమవుతున్నారు. అలాగే ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రష్మిక కలసి రణబలి అనే సినిమాలో నటిస్తున్నారు.