అప్పుడే అదరగొడుతున్న తారక్ చిన్నోడు.. స్కిల్స్ చూస్తే షాక్.. భార్గవ్ రామ్ ట్యాలెంట్‌కు ఫిదా అవ్వాల్సిందే..!
ఈ పోటీలో భార్గవ్ రామ్ ఒక ఏనుగు (Elephant) చిత్రాన్ని గీసి, దానికి అద్భుతమైన రంగులు అద్దాడు. తను గీసిన పెయింటింగ్‌ను పట్టుకుని చిరునవ్వుతో ఉన్న భార్గవ్ ఫోటో ఇప్పుడు వైరల్‌గా మారింది."నటనే కాదు.. కళలోనూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు" అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ఫోటోను ట్రెండ్ చేస్తున్నారు. చిన్న వయసులోనే అంత పర్ఫెక్ట్గా డ్రాయింగ్ వేయడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
నందమూరి కుటుంబంలో నటన అనేది రక్తంలోనే ఉంది. అయితే, భార్గవ్ రామ్ మాత్రం చదువుతో పాటు ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో కూడా టాప్ లో ఉంటున్నాడు.కేవలం పెయింటింగ్ మాత్రమే కాదు, గతంలో భార్గవ్ రామ్ జిమ్నాస్టిక్స్ చేస్తున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. అంటే ఫిజికల్ ఫిట్నెస్తో పాటు క్రియేటివిటీలోనూ తారక్ వారసుడు తగ్గేదే లే అంటున్నాడు.పెద్ద కొడుకు అభయ్ రామ్ కాస్త క్లాసీగా, సైలెంట్‌గా కనిపిస్తే.. భార్గవ్ రామ్ మాత్రం అచ్చం తండ్రిలాగే ఫుల్ ఎనర్జీతో, మాస్ వైబ్స్‌తో కనిపిస్తాడని ఫ్యాన్స్ అంటుంటారు.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీ బిజీగా ఉంటున్నాడు.