హీరోయిన్ స్నేహకు ప్రమాదం జరిగిందా..?
ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్ ని మొదలుపెట్టింది హీరోయిన్స్ స్నేహ .ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితంలో ఎదురైనా ఒక చేదు సంఘటన గురించి వెల్లడించింది. కెరియర్ పీక్ స్టేజ్ లో , బిజీగా ఉన్న సమయంలో తనకు ఒక ఘోర ప్రమాదం జరిగిందని, ఆ ప్రమాదంలో చేతులు కాళ్లు వీపు భాగాలకు చాలా గాయాలయ్యాయి కనీసం నిలబడడానికి కూడా ఏడాది పైగనే సమయం పడుతుందని వైద్యులు చెప్పారని, ఆ విషయం తనని చాలా మానసిక వేదనకు గురయ్యేలా చేసిందంటూ తెలిపింది.
తన కెరియర్ ముగిసింది, మంచానికి పరిమితం అయ్యానని చాలా భయపడ్డాను. అయితే ఆ సమయంలో డైరెక్టర్ కరు పళనియప్పన్ "పార్దిబన్ కనవు " అనే కథతో తనని సంప్రదించగా తన పరిస్థితి తెలుసుకొని తనపైన నమ్మకం ఉంచి అవకాశం ఇవ్వడంతో ఆశ్చర్యపోయానని పేర్కొంది స్నేహ. ఆయన ఇచ్చిన ధైర్యం ప్రోత్సాహం వల్లే తాను మళ్ళీ నిలబడగలిగానని ఆ నమ్మకం వల్లే మళ్లీ కెమెరా ముందుకు రాగలిగాను అంటూ ఎమోషనల్ గా మాట్లాడింది. 2012లో ప్రసన్న అనే నటుడిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం స్నేహకు సంబంధించి ఈ విషయం మాత్రం వైరల్ గా మారింది. వీరికి ఒక కొడుకు , కూతురు అన్నారు. అలాగే పలు రకాల బిజినెస్ లు కూడా ఉన్నట్లు సమాచారం.