“మా ప్రైవసీ మా హక్కు” – గళమెత్తిన కన్నడ హీరోయిన్లు!
సెలబ్రిటీల పాపులారిటీని క్యాష్ చేసుకోవడానికి షాపింగ్ మాల్స్, జ్యువెలరీ సంస్థలు వారిని పిలిచి ఓపెనింగ్స్ చేయిస్తుంటాయి. వారం రోజుల ముందే ప్లకార్డులు వేసి మరీ ప్రచారం చేస్తారు. తమ అభిమాన నటిని చూడటానికి జనం వేల సంఖ్యలో తరలిరావడం సహజం. కానీ, ఇక్కడే అసలైన వికృత చేష్టలు మొదలవుతున్నాయి.
ఫోటోలు తీసే నెపంతో కొందరు ఆకతాయిలు, ఈవెన్ కొందరు ఫోటోగ్రాఫర్లు కూడా హీరోయిన్ల శరీర భాగాలను జూమ్ చేసి మరీ ఫోటోలు తీస్తున్నారు. సినిమా ఫంక్షన్లలో లేదా పబ్లిక్ ఈవెంట్లలో నటీమణులు స్టేజ్ మీద ఉన్నప్పుడు, కింద ఉన్నవారు కెమెరాలను అడ్డదిడ్డంగా తిప్పుతూ వారి ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారు.
ఈ అరాచకాన్ని సహించలేక కన్నడ బ్యూటీలు సప్తమి గౌడ (కాంతార ఫేమ్), ఆశికా రంగనాథ్, రుక్మిణీ వసంత్ తమ ఇన్స్టాగ్రామ్ ద్వారా పవర్‌ఫుల్ పోస్ట్‌లు పెట్టారు."మా శరీరాలను జూమ్ చేసి ఫోటోలు తీయాల్సిన అవసరం ఏముంది? ఇది ఎంతవరకు ఆమోదయోగ్యం?" అంటూ వారు నేరుగా సమాజాన్ని, ఆకతాయిలను ప్రశ్నిస్తున్నారు. పబ్లిక్ ఫిగర్స్ అయినంత మాత్రాన మా శరీరాలపై మాకు హక్కు ఉండదా? అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్ట్‌లు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
ఇన్ని రోజులు సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం లైంగిక వేధింపులు (Casting Couch) ఉన్నాయని విన్నాం. కానీ, ఇప్పుడు కళ్ల ముందే, వేల మంది సాక్షిగా జరుగుతున్న ఈ 'డిజిటల్ వేధింపులు' అంతకంటే భయంకరంగా ఉన్నాయి.సెలబ్రిటీల శరీర భాగాలను జూమ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి వ్యూస్, లైకులు సంపాదించుకోవాలనే నీచమైన ఆలోచనే దీనికి కారణం.ఈ చేదు అనుభవాల వల్ల హీరోయిన్లు పబ్లిక్ ఈవెంట్లకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
న్నడ ముద్దుగుమ్మలు మొదలుపెట్టిన ఈ పోరాటం కేవలం వారి కోసమే కాదు.. యావత్ చిత్ర పరిశ్రమలో ఉన్న మహిళా మణులందరి కోసం. ఇలాంటి ఆకతాయిలను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అటు పోలీసుల మీద, ఇటు ఈవెంట్ నిర్వాహకుల మీద ఉంది.మరి ఈ 'జూమ్ అరాచకాలపై' ఇండస్ట్రీ పెద్దలు, మరి ఈ విషయంపై ఇండస్ట్రీ పెద్దలు, అధికారులు ఏదైనా నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి.