బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్లతో బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న శ్రీలీల!

Amruth kumar
టాలీవుడ్ సెన్సేషన్, డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఇప్పుడు రూటు మార్చింది. ఒకప్పుడు వరుస సినిమాలతో టాలీవుడ్‌ను ఊపేసిన ఈ కన్నడ కస్తూరి, ఇప్పుడు చాలా తెలివైన నిర్ణయాలతో కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటోంది. కేవలం గ్లామర్ డాల్‌గా మిగిలిపోకుండా, ఐటమ్ సాంగ్స్ ఆఫర్లను సున్నితంగా తిరస్కరిస్తూ తన రేంజ్ ఏంటో చూపిస్తోంది. కొందరు మేకర్స్ హీరోయిన్ ఛాన్స్ అని ఆశ చూపి, మెల్లగా ఐటమ్ సాంగ్స్‌లోకి లాగే ప్రయత్నం చేసినా.. వారి ‘అతి తెలివి’ని పసిగట్టి ప్రాజెక్టుల నుంచే ఎస్కేప్ అయిపోయిందట మన శ్రీలీల.


శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఆషీకీ 3’ (Aashiqui 3) చిత్రంతో జరగబోతోంది. అనురాగ్ బసు దర్శకత్వంలో వస్తున్న ఈ మ్యూజికల్ లవ్ స్టోరీలో శ్రీలీల, చాక్లెట్ బాయ్ కార్తీక్ ఆర్యన్‌కు జోడీగా నటిస్తోంది.ఈ సినిమాలో స్క్రిప్ట్ డిమాండ్ మేరకు ఇంటిమేట్ సీన్స్ ఉన్నా, శ్రీలీల వెనకడుగు వేయలేదు. తాను ఒక ‘డైరెక్టర్స్ హీరోయిన్’ అని నిరూపించుకోబోతోంది. గతంలో శ్రద్ధా కపూర్ కెరీర్‌ను ‘ఆషీకీ 2’ ఎలా మార్చేసిందో, ఇప్పుడు శ్రీలీలకు కూడా అదే రేంజ్ సక్సెస్ దక్కుతుందని బాలీవుడ్ పండితులు అంచనా వేస్తున్నారు.



 కార్తీక్, శ్రీలీల ఇద్దరూ అద్భుతమైన డ్యాన్సర్లు కావడంతో, ఈ మ్యూజికల్ హిట్ లో వీరి స్టెప్పులు థియేటర్లను షేక్ చేయడం ఖాయం!‘ఆషీకీ 3’ సెట్స్‌లో ఉండగానే, కార్తీక్ ఆర్యన్-శ్రీలీల కాంబినేషన్ లో మరో సినిమా చర్చల్లోకి వచ్చింది. దీనికి ‘ఫీటమ్ పురా’ (Feetum Pura) అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇదొక భారీ యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఒకేసారి రెండు బాలీవుడ్ చిత్రాల్లో నటించడం అంటే శ్రీలీల రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పొచ్చు.



తెలుగు, హిందీ మాత్రమే కాదు.. ఇప్పుడు తమిళ తమ్ముళ్లను కూడా శ్రీలీల పలకరించబోతోంది. కోలీవుడ్ స్టార్ ధనుష్ 55వ చిత్రంలో (D55) శ్రీలీల హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది.ధనుష్‌తో నటించే ఛాన్స్ కోసం ఎంతోమంది స్టార్ హీరోయిన్లు క్యూలో ఉన్నా, చివరకు ఆ లక్ శ్రీలీలనే వరించింది. ఈ సినిమాతో కోలీవుడ్‌లో కూడా శ్రీలీల జెండా పాతడం ఖాయంగా కనిపిస్తోంది.త్వ‌రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో శ్రీలీల నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా విడుదలయ్యి హిట్ టాక్ తెచ్చుకుంటే, టాలీవుడ్‌లో శ్రీలీల పేరు మళ్ళీ మారుమోగిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: