నటి పావలా శ్యామల విషయంలో గొప్ప మనసు చాటుకున్న అల్లు అర్జున్..!
గతంలో మెగాస్టార్ చిరంజీవి, సాయి ధరమ్ తేజ్, ఆకాష్ పూరి తదితర హీరోలు కూడా నటి పావలా శ్యామలకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్ ప్రతినెల ఆమెకు పదివేల రూపాయలు అందించేలా ఏర్పాటు చేసినట్టుగా వినిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. ప్రస్తుతం ఆమె తన కూతురితో కలిసి ఉంటోంది. మరి అల్లు అర్జున్ చేస్తున్న ఈ సహాయం పైన నటి పావలా శ్యామల ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.
అల్లు అర్జున్ విషయానికి వస్తే ఇటీవల తన సోదరుడు పెళ్లి వివాహ వేడుకలలో బిజీగా ఉన్నారు. సినిమాల విషయానికి వస్తే పుష్ప 2 సినిమా తర్వాత డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కూడా త్వరలోనే మొదలు కాబోతోంది. ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది. అలాగే డైరెక్టర్ సుకుమార్ తో పుష్ప 3 సినిమా, అలాగే త్రివిక్రమ్ తో కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్లు వినిపిస్తున్నాయి.