పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..రిలీజ్ డేట్ కంటే ముందుగానే ఉస్తాద్ భగత్ సింగ్..!

Divya
కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న తాజా చిత్రం టాక్సిక్. ఈ చిత్రం ఈనెల 19వ తేదీన విడుదల కావాల్సి ఉండగా, గల్ఫ్ దేశాలలో  యుద్ధం వల్ల అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో టాక్సిక్ సినిమాని పోస్ట్ ఫోన్ చేశారు. దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదల పైన పలు కీలకమైన మార్పులు వేగవంతంగా జరుగుతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే టాలీవుడ్ లో వినిపిస్తున్న ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలలో డిస్ట్రిబ్యూటర్లు మార్చి 19న గురువారం విడుదల చేయాలని మేకర్స్ ముందు డిమాండ్ తీసుకువచ్చారట.


టాక్సిక్ సినిమా రిలీజ్ పోస్ట్ ఫోన్ కావడంతో  ఇప్పుడు ఆ ప్లేస్ ఖాళీ అవడంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను వినియోగించుకునే అవకాశం ఉన్నట్లు వినిపిస్తున్నాయి. భారీ అంచనాల మధ్య రూపొందించిన పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకు కూడా ఇదే సరైన సమయం అని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ విషయంలో చిత్ర బృందం వేగంగానే పాల్గొనింది. త్వరలోనే విడుదల తేదీ పైన అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. విడుదల తేదీ కంటే ముందుగానే సినిమా రాబోతూ ఉండడంతో సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ త్వరగా ఫినిష్ చేయడానికి థమన్ రంగంలోకి దిగినట్లు వినిపిస్తున్నాయి.


ఓజి సినిమాతో థమన్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కు ఏ రేంజ్ లో ఇస్తారో చూడాలి మరి. మొత్తానికి టాక్సిక్ సినిమా వాయిదా పవన్ కళ్యాణ్ సినిమాకు బాగా కలిసి వచ్చేలా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. డైరెక్టర్ హరీష్ శంకర్ , పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న రెండవ సినిమా కావడం చేత ఈ సినిమా పైన అంచనాలు పెరిగిపోయాయి. మరి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంతో ఎలాంటి రికార్డులను తీరగరాస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: