సంచలన నిర్ణయం తీసుకున్న స్టార్ సింగర్.. ఎవరంటే..?
శ్రేయ మాట్లాడుతూ.. ఆ పాటలో అద్భుతమైన ట్యూన్ కళాత్మకం ఉన్నదని అయితే ఆ పెద్ద పాట హిట్ కావడానికి తాను గౌరవిస్తానని, కాని చిన్నపిల్లలకు ఆ పాటలోనే అర్థం తెలియకుండానే పాడుతూ ఉండడం చాలా ఇబ్బందిగా చాలాసార్లు అనిపించిందని, కొన్నిసార్లు నా దగ్గరకు వచ్చి ఆ పాటను పాడమని చెబితే తాను ఆ సౌకర్యంగా అనిపించిందని తెలియజేసింది. అప్పటినుంచి పాటలను ఎంచుకునేటప్పుడు తాను సాహిత్యం పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టానని, ఆ తర్వాత ఎన్నో ఐటెం సాంగ్స్ ఆఫర్లు వచ్చినా కూడా తన సున్నితంగానే తిరస్కరించానని తెలియజేసింది శ్రేయ ఘోషల్
అయితే తన పాట ఎంత పెద్ద విజయాన్ని అందించిందో అది సమాజం పైన ముఖ్యంగా పిల్లలపైన చూపే ప్రభావాన్ని కూడా తాను దృష్టిలో పెట్టుకొని పలు నిర్ణయాలు తీసుకుంటున్నానని తెలియజేసింది ఈ విషయం పైన అటు అభిమానులు నేటిజన్స్ సైతం శ్రేయ ఘోషల్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక సింగర్ గా కేవలం ట్యూన్ నే కాకుండా పదాలకు కూడా విలువ ఇచ్చేలా ఆలోచన చేయడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. తెలుగులో కూడా సుమారుగా 290 కి పైగా అద్భుతమైన పాటలు పాడింది. ప్రస్తుతం శ్రేయ ఘోషల్ తీసుకున్న ఈ నిర్ణయం తన కెరీర్ కి ఏ విధంగా ఉపయోగపడుతుందొ చూడాలి