పూజా హెగ్డేకు వరుడు వెతుకుతున్న పేరెంట్స్.. పెళ్లి ఎప్పుడంటే?
పూజా హెగ్డేకు ప్రస్తుతం 35 ఏళ్లు నిండటంతో, ఆమె తల్లిదండ్రులు మంజునాథ్ హెగ్డే, లతా హెగ్డే పెళ్లి విషయంలో గట్టిగానే ఒత్తిడి చేస్తున్నారట.గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ చర్చలకు పూజా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. "మంచి సంబంధం ఉంటే చూడండి" అని ఆమె పేరెంట్స్‌కు చెప్పడంతో, వారు ముంబైకి చెందిన ఒక పెద్ద వ్యాపారవేత్త (Businessman) కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నారట.పూజా స్వస్థలం క
పూజా హెగ్డే పేరు గతంలో చాలామందితో ముడిపడి ఉంది. కానీ ఆమె దేనికీ అధికారికంగా స్పందించలేదు.దివంగత నటుడు వినోద్ మెహ్రా కుమారుడు రోహన్ మెహ్రాతో పూజా చాలా సన్నిహితంగా ఉంటుందని టాక్. ముఖ్యంగా 2024 ఏప్రిల్‌లో పూజా తల్లిదండ్రులతో కలిసి రోహన్ లంచ్‌కు వెళ్లడం చూసి, వీరిద్దరి పెళ్లి ఫిక్స్ అని అందరూ అనుకున్నారు.'కిసీకా భాయ్ కిసీకా జాన్' సమయంలో సల్మాన్‌తో ప్రేమలో ఉందని, ఆ తర్వాత ఒక కర్ణాటక క్రికెటర్‌ను పెళ్లాడుతుందని రకరకాల కథనాలు వచ్చాయి.యంగ్ హీరో ఇషాన్ ఖట్టర్‌తో కలిసి ట్రిప్పులకు వెళ్లిన ఫోటోలు కూడా సందేహాలకు తావిచ్చాయి. అయితే బాలీవుడ్ మీడియా వీటిని కేవలం గాసిప్స్‌గానే తేల్చిపారేసింది.
పెళ్లి గోల పక్కన పెడితే, పూజా కెరీర్ మళ్ళీ పుంజుకుంటోంది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. టాలీవుడ్ కాస్త గ్యాప్ ఇచ్చినా, కోలీవుడ్ మాత్రం పూజాను అక్కున చేర్చుకుంది. వరుసగా క్రేజీ ప్రాజెక్టులు సైన్ చేస్తోంది.తెలుగు ప్రేక్షకులకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే.. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న ఒక తెలుగు సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా ఎంపికైంది. ఈ సినిమా హిట్టైతే పూజా టాలీవుడ్ కంబ్యాక్ అదిరిపోవడం ఖాయం.పూజా హెగ్డే పెళ్లి వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ ముంబై బిజినెస్‌మెన్‌తో పెళ్లి కుదిరితే, త్వరలోనే పూజా ఇంటి నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.