పవన్ కళ్యాణ్ సినిమాకు లాస్ట్ మినిట్ ‘మ్యూజికల్’ ట్విస్ట్.. తమన్‌కు ఇది నిజంగా టఫ్ టాస్క్!

Amruth kumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్ నుంచి ఒక షాకింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. సినిమా విడుదలకు సిద్ధమవుతున్న వేళ, అనూహ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ మారిపోయారు. ‘రాక్ స్టార్’ దేవిశ్రీ ప్రసాద్ స్థానంలోకి ‘మ్యూజిక్ సెన్సేషన్’ ఎస్.ఎస్. థమన్ వచ్చి చేరారు. ఈ మార్పుపై చిత్రబృందం అధికారిక ప్రకటన చేస్తూ, కేవలం ‘వెసులుబాటు’ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.


నిజానికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈనెల 26న విడుదల కావాల్సి ఉంది. కానీ తాజా సమాచారం ప్రకారం, ఒక వారం ముందే అంటే మార్చి 19నే బాక్సాఫీస్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అంటే థమన్ చేతిలో కనీసం 15 రోజుల సమయం కూడా లేదు.దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే సగం సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ (RR) పూర్తి చేశారు. మిగిలిన సగం బాధ్యత ఇప్పుడు థమన్ భుజాల మీద పడింది.ఒక మ్యూజిక్ డైరెక్టర్ సినిమాను మొదటి నుంచి అర్థం చేసుకుంటేనే ఆ పాత్రల తీరుతెన్నులకు తగ్గట్టుగా సంగీతం ఇవ్వగలరు. కానీ ఇప్పుడు థమన్ మధ్యలో వచ్చి, దేవిశ్రీ క్రియేట్ చేసిన ఆ ‘ఫ్లో’ని కంటిన్యూ చేయాలి. ఎక్కడా అతికించినట్టు ఉండకూడదు.


సాధారణంగా పాటల్లో వాడిన ట్రాక్స్‌నే ఆర్‌.ఆర్‌లో వాడుతుంటారు. కానీ ఇక్కడ పాటలు ఇచ్చింది దేవిశ్రీ ప్రసాద్. థమన్ ఆ ట్యూన్స్‌ని తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లో వాడే అవకాశం లేదు. థమన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలివేషన్లకు, యాక్షన్ సీన్లకు సరికొత్తగా బిజీయమ్స్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది.నేటి కాలంలో కమర్షియల్ సినిమాల సక్సెస్‌లో 50% క్రెడిట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కే వెళ్తోంది. థమన్ ఇచ్చే ఆ ‘సౌండ్’ గనుక పవర్ స్టార్ ఇమేజ్‌కు తగ్గట్టుగా లేకపోతే సీన్ పండదు. అందుకే ఇది థమన్‌కు ఒక అగ్నిపరీక్ష లాంటిదే.



కష్టకాలంలో ఆదుకోవడంలో థమన్‌కు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. గతంలో కూడా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కొన్ని సినిమాలకు ఆయన ప్రాణం పోశారు.రీసెంట్‌గా ‘పుష్ప 2’లో కూడా కొన్ని కీలక ట్రాకులను థమనే అందించారు. ఆ అనుభవం ఇప్పుడు ‘ఉస్తాద్’కు ప్లస్ అవుతుందని చిత్ర యూనిట్ గట్టిగా నమ్ముతోంది.ఒకవైపు బాలయ్య NBK 111 పనుల్లో ఉంటూనే, మరోవైపు పవన్ కళ్యాణ్ కోసం థమన్ రేయింబవళ్లు కష్టపడుతున్నారట.రామ్ చరణ్ ‘పెద్ది’ సాంగ్స్ రచ్చ చేస్తున్న సమయంలో, పవన్ కళ్యాణ్ సినిమా అప్‌డేట్ రావడం మెగా ఫ్యాన్స్‌లో జోష్ నింపింది. కాకపోతే మ్యూజిక్ డైరెక్టర్ మారడం అనేది చిన్న రిస్క్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: