కియారా బికినీ పిక్ పై వర్మ హాట్ కామెంట్స్..ఈయన ఇక మారడు..!?
వర్మ చేసిన వ్యాఖ్యలో హీరోలైన హృతిక్ రోషన్ మరియు జూ ఎన్ టీఆర్ మధ్య జరిగే పోరాటం దేశాల కోసం కాకుండా కియారా అందాన్ని దక్కించుకోవడానికైతే ఆ చిత్రం పరిశ్రమలోనే పెద్ద విజయాన్ని సాధిస్తుందని అర్థం వచ్చేలా ఆయన రాశారు. ఈ వ్యాఖ్యలు మహిళను గౌరవించని భావం ఉందని అనేక మంది విమర్శించారు. మహిళను కేవలం శరీర సౌందర్యంతో మాత్రమే చూడడం సరైంది కాదని పలువురు వినియోగదారులు తీవ్రంగా స్పందించారు. కొంతమంది అయితే వర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్త విషయం కాదని, ఆయన శైలి ఎప్పుడూ ఇదే అని అన్నారు.
సామాజిక మాధ్యమాల్లో విమర్శలు పెరగడంతో ఆ పోస్ట్ ను వర్మ తొలగించారు. అయితే రీసెంట్ గా ఈ విషయంపై ఆయన స్పందిస్తూ తనకు అందమైన మహిళలను చూసినప్పుడు కలిగే భావాలను దాచిపెట్టే అలవాటు లేదని చెప్పారు. తన వ్యాఖ్యను దూషణగా కాకుండా ఒక విధమైన ప్రశంసగా చూడాలని అన్నారు. ఒక మహిళ బికినీ ధరించి చిత్రంలో కనిపిస్తే అది ప్రేక్షకుల్లో స్పందన కలిగించడానికే కదా అని ఆయన ప్రశ్నించారు. తాను కూడా ఒక ప్రేక్షకుడిగా తనకు అనిపించిన భావాన్ని చెప్పానని వివరించారు.అంతేకాకుండా తన ఆలోచనా విధానం ఎప్పటినుంచో ఇదే అని వర్మ పేర్కొన్నారు. ఆ పోస్ట్ ఎందుకు తొలగించారని అడిగినప్పుడు మాత్రం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. నిజం చెప్పాలంటే ఎందుకు తొలగించానో ఇప్పుడు గుర్తు లేదని చెప్పి ఆ ప్రశ్నను తప్పించుకున్నారు. ఈ సమాధానం విన్న తరువాత కూడా సామాజిక మాధ్యమాల్లో చర్చ ఆగలేదు. కొందరు వర్మ మాట్లాడే విధానం ఎప్పుడూ వివాదాలకు దారితీస్తుందని అంటుండగా, మరికొందరు ఆయన చెప్పే మాటలలో ఉన్న తర్కం సాధారణ ప్రజలకు అర్థం కావడం కష్టమని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.