కాజల్ రేంజ్‌కు ఇది అవసరమా?.. వైరల్ రీల్‌పై ఫ్యాన్స్ ఫైర్!

Amruth kumar
టాలీవుడ్‌లో ఒకప్పుడు వెలుగు వెలిగిన సీనియర్ బ్యూటీ, చందమామ కాజల్ అగర్వాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈసారి ఆమె ఏదైనా సినిమా అప్‌డేట్ తోనో, గ్లామర్ ఫోటో షూట్ తోనో వార్తల్లోకి రాలేదు. తాజాగా ఆమె పాల్గొన్న ఒక రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో చేసిన ‘రీల్’ ఇప్పుడు నెట్టింట పెద్ద దుమారమే రేపుతోంది. ఒక టాప్ హీరోయిన్ ఇలాంటి పని చేయడమేంటని కొందరు, ప్రమోషన్ కోసం తప్పదు కదా అని మరికొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.



విశాఖపట్నంలో ‘హయ్య జైలు మండి’ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి కాజల్ అగర్వాల్ చీఫ్ గెస్ట్‌గా వెళ్ళిన సంగతి తెలిసిందే. అక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ, ఆ ఈవెంట్ కి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఉప్పల్ బాలు కూడా హాజరయ్యాడు.ఉప్పల్ బాలు ఉత్సాహంగా కాజల్ దగ్గరకు వెళ్లి మాట్లాడటమే కాకుండా, తనదైన స్టైల్‌లో ఒక రీల్ చేశాడు. దానికి కాజల్ కూడా ఏమాత్రం మొహమాట పడకుండా అతడి స్టెప్స్‌కు రెస్పాండ్ అవుతూ నవ్వుతూ వీడియో ఇచ్చింది.ఈ వీడియో బయటకు రావడమే ఆలస్యం.. నిమిషాల్లో వైరల్ అయిపోయింది. ఇన్ స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) వేదికల్లో ఈ రీల్ చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.



ఈ రీల్ చూసిన కాజల్ వీరాభిమానులు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారి వాదన ఏంటంటే: మగధీర, బిజినెస్‌మెన్ వంటి ఇండస్ట్రీ హిట్లలో నటించిన కాజల్.. ఇలాంటి చిన్న ప్రమోషనల్ ఈవెంట్లకు వెళ్లడమే కాకుండా, యూట్యూబర్లతో కలిసి రీల్స్ చేయడం ఆమె స్థాయికి తగదని వారు అభిప్రాయపడుతున్నారు. "రెస్టారెంట్ ఓపెనింగ్ కి వెళ్లడం ఓకే.. కానీ ఇలాంటి రీల్స్ అవసరమా?" అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. కాజల్ లాంటి స్టార్ హీరోయిన్ ఇలాంటి వారి పక్కన కనిపించడం వల్ల ఆమె బ్రాండ్ వాల్యూ తగ్గుతుందని వారు ఆందోళన చెందుతున్నారు.



అయితే, అందరూ విమర్శించడమే కాదు.. కొందరు కాజల్‌కు మద్దతుగా కూడా నిలుస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా కాలం నడుస్తోందని, సినిమాల్లో ఉన్నా లేకపోయినా పబ్లిక్ లో ఉండాలంటే ఇలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్ల సహాయం తప్పదని వారు చెబుతున్నారు. ఒక సామాన్య ఇన్‌ఫ్లుయెన్సర్ అడిగినప్పుడు కాజల్ కాదనకుండా రీల్ చేయడం ఆమె ‘డౌన్ టు ఎర్త్’ స్వభావానికి నిదర్శనమని వారు ప్రశంసిస్తున్నారు.కాజల్ అగర్వాల్ రీల్ మ్యాటర్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ కేకులా మారింది. మరి తనపై వస్తున్న ఈ విమర్శల మీద ‘చందమామ’ ఏమైనా స్పందిస్తుందా? లేక ‘లైట్’ తీసుకుంటుందా? అన్నది చూడాలి.


https://www.instagram.com/reels/DVfn4t1Cd2y/




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: