ప్రపంచంలో ఎంతోమంది హీరోయిన్స్ ఉన్నా కూడా..కేవలం నయనతారకి మాత్రమే ఎందుకు ఇలా..?
ఇటీవల ఆమె మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ ద్వారా మళ్లీ ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలై మంచి హిట్ అందుకుంది. సినిమాలో నయనతార పాత్రకు కూడా మంచి ప్రాధాన్యం ఉండటంతో ప్రేక్షకులు ఆమె నటనను మరొకసారి మెచ్చుకున్నారు. మెగాస్టార్ వంటి పెద్ద స్టార్‌తో కలిసి నటించడం ద్వారా ఈ సినిమా మరింత హైప్ తెచ్చుకుంది.ఇక నయనతార కెరీర్ విషయానికి వస్తే, వయసు పెరుగుతున్నప్పటికీ ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. చాలామంది హీరోయిన్లు ఒక దశ తర్వాత అవకాశాలు తగ్గిపోతుంటాయి. కానీ నయనతార విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఆమెకు ఇప్పటికీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు వరుసగా వస్తున్నాయి. కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ఆమె తన కెరీర్‌ను ఎంతో తెలివిగా ముందుకు తీసుకెళ్తున్నారు.
ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన వార్త కూడా సినీ వర్గాల్లో వినిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న ఓ భారీ చిత్రంలో నయనతారకు అవకాశం వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ వార్త నిజమైతే, నయనతారకు ఇది మరో పెద్ద అవకాశంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆమె తమిళం, తెలుగు, మలయాళం వంటి భాషల్లో తన సత్తా చాటగా, ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా మరింత బలంగా అడుగుపెట్టే అవకాశం లభించనుంది. అంతేకాకుండా సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోతో కలిసి నటించడం వల్ల ఈ ప్రాజెక్టుపై భారీ స్థాయిలో అంచనాలు ఉండే అవకాశం ఉంది.