ధరుంధర్ 2 ట్రైలర్: అరాచకం సృష్టిస్తున్న రణవీర్ సింగ్..!
ఇందులో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ని శనివారం రోజున మేకర్స్ విడుదల చేయగా తెలుగు ట్రైలర్ ని ఆదివారం విడుదల చేశారు. ట్రైలర్ మొదటి నుంచి లాస్ట్ వరకు అదిరిపోయే యాక్షన్ తో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఒక్కొక్క డైలాగ్ , రన్వీర్ సింగ్ యాక్టింగ్ యాక్షన్ ట్రైలర్ ని మరింత హైలెట్గా చేశాయి. ఇక సంజయ్ దత్ చెప్పే డైలాగ్ కూడా బాగానే హైలైట్ అవుతున్నాయి. చివరిలో పాకిస్తాన్ భవిష్యత్తు హిందుస్థాన్ నిర్ణయిస్తుంది అంటూ రన్వీర్ సింగ్ చెప్పే డైలాగ్ ట్రైలర్ కి హైలైట్ గా ఉంది.
డైరెక్టర్ ఆదిత్య ధర్ తెరకెక్కించిన తీరు విజువల్ వండర్స్ అన్ని ట్రైలర్ లో కూడా మరింత అద్భుతంగా కనిపించాయి. రణ్వీర్ సింగ్ మాస్ లుక్ లో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ లో అద్భుతంగా అలరించారు. మొదటి భాగంలో ఉన్న ఎమోషన్స్ కు మించి ఈసారి రివేంజ్ గ్రామాన్ని చాలా పవర్ ఫుల్ గా చూపించబోతున్నట్లు కనిపిస్తోంది. 19 మార్చి 2026 న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది అంతకంటే ముందుగా 18 మార్చి సాయంత్రం 5గంటల నుంచి దేశవ్యాప్తంగా పెయిడ్ ప్రీమియర్ షోలు పడనున్నాయి. చూస్తూ ఉంటే మొదటి రోజు రికార్డులను సైతం బద్దలు కొట్టేలా కనిపిస్తోంది మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విద్వాంశం సృష్టిస్తుందో చూడాలి.