సినిమా వాళ్లు రాజకీయాల గురించి మాట్లాడడం సర్వసాధారణం.. కొంతమంది సినిమాలు చేస్తూ రాజకీయాల్లోకి వెళ్తారు. మరి కొంతమంది నటీనటులు రాజకీయాల గురించి ప్రశ్న ఎదురైతే ఈ గొడవంతా మనకెందుకులే అని ఆ ప్రశ్నలను స్కిప్ చేస్తారు.కానీ కొంతమంది నటీనటులు మాత్రం రాజకీయాలపై స్పందిస్తూ అప్పుడప్పుడు వివాదాల పాలవుతూ ఉంటారు.అయితే తాజాగా నటుడు శివాజీ కూడా అలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు.. బిగ్ బాస్ రియాల్టీ షో తర్వాత మళ్లీ ఫామ్ లోకి వచ్చిన శివాజీ #90's మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్, కోర్టు సినిమాతో మంచి క్రేజ్ సంపాదించారు. దాంతో వరుస పెట్టి సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. అలా తాజాగా ఆయన సీనియర్ నటి లయతో కలిసి సాంప్రదాయిని సుప్పినీ సుద్ధపూసిని అనే మూవీతో మన ముందుకు వచ్చారు.
అయితే ఈ సినిమా బాగున్నప్పటికి కొంతమంది పేటియం బ్యాచ్ తన సినిమాపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు మాజీ సీఎం జగన్ గురించి మాట్లాడుతూ.. నేను రాజధాని అమరావతి గురించి మాట్లాడడం వల్లనే మాజీ సీఎం జగన్ తన పేటీఎం బ్యాచ్ ద్వారా తన సినిమాపై తప్పుడు ప్రచారం చేయిస్తూ తప్పుడు రాతలు రాయిస్తున్నారు. నా సినిమా పని అయిపోయిందని, సినిమా ప్లాఫ్ అయిందని,సినిమా ఇక ఆడదని పేటీఎం బ్యాచ్ తో రాయిస్తున్నారు. నా సినిమా బాగోలేదని సినిమా రిలీజ్ కాకముందే రివ్యూలు రాయించారు..
నా సినిమా వారం రోజులవరకైనా జనాలకి బాగా ఎక్కుతుంది. నా సినిమాని ఎవరు ఆపలేరు. జగన్ సీఎం గా ఉన్నప్పుడే ఏమీ చేయలేదు. ఇప్పుడు నన్నేం చేస్తాడు.. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా నన్నేమీ పీకలేరు.. ప్రధాని మోడీ గారిని కలిస్తే సిబిఐ కేసులు ఉన్న వ్యక్తులను రాజకీయాల నుండి పక్కన పెట్టాలని కోరుతా.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నటుడు శివాజీ.ప్రస్తుతం శివాజీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ ఈమధ్యనే ఆడవాళ్ళ గురించి మాట్లాడి వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పుడు మళ్లీ మాజీ సీఎం జగన్ గురించి మాట్లాడారు. మరి ఈ వ్యాఖ్యలపై జగన్ అభిమానులు, వైఎస్ఆర్సిపి నాయకులు శివాజీని ఎలా టార్గెట్ చేస్తారో అంటూ కామెంట్లు పెడుతున్నారు.