బాలీవుడ్ హీరో సినిమాలో సమంత..?
బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన సల్మాన్ ఖాన్ సినిమాలో సమంత అవకాశం అందుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. రాజ్ అండ్ డీకే డైరెక్షన్లో ఈ సినిమాని చాలా గ్రాండ్ గా తెరకెక్కించేందుకు సిద్ధమైనట్లు బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో యాక్షన్ సీన్స్ చాలానే ఉండబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం సమంత మా ఇంటి బంగారం అనే సినిమాతో పాటు రక్త బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. ఇటువంటి తరుణంలోనే సల్మాన్ ఖాన్ సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం వచ్చినట్లు సమాచారం. త్వరలో ఇందుకు సంబంధించి చిత్ర బృందం అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వినిపిస్తున్నాయి.
ఇదంతా ఇలా ఉండగా ఇటీవల కాలంలో డైరెక్టర్ రాజ్ నిడిమోరును ప్రేమించి మరి రెండవ వివాహం చేసుకున్న సమంత నిరంతరం సోషల్ మీడియాలో ఏదో ఒక విషయంలో వైరల్ గా మారింది. గతంలో అక్కినేని నాగచైతన్య ను ప్రేమించి వివాహం చేసుకోగా ఆ వివాహం చేసుకున్న మూడేళ్లకే విడిపోయారు. ఆ తర్వాత నాగచైతన్య మరో హీరోయిన్ శోభితను ప్రేమించి వివాహం చేసుకున్నారు. దాదాపుగా ఐదేళ్లపాటు సింగిల్ గా ఉన్న సమంత చివరికి రెండో వివాహం చేసుకొని సెటిల్ అయ్యింది. మరి బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటించే అవకాశాలు రావడంతో తెలుగు సినిమాలను తగ్గించే అవకాశాలు ఉన్నట్లుగా వినిపిస్తున్నాయి.