చిన్న సినిమాగా తీసి.. ఏకంగా రూ .50 కోట్లు కొల్లగొట్టిన సీనియర్ నటి..!

Divya
ఈ రోజుల్లో చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా సినిమా బాగుందంటే చాలు ప్రేక్షకుల సైతం ఎలాంటి సినిమాకైనా సరే బ్రహ్మరథం పట్టేస్తున్నారు. అలా చిన్న చిత్రాలుగా విడుదలై సంచలనాలు సృష్టించిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇటీవలే సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన తాయికీళవి చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతోంది. కేవలం రూ .9 కోట్ల రూపాయలతో తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ .50 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబడినట్లు వినిపిస్తోంది.


ఈ చిత్రం విజయానికి ముఖ్య కారణం నటి రాధికా శరత్ కుమార్ నటనే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 63 ఏళ్ల వయసులో కూడా ఆమె నటించిన తీరు మాస్ మేనరిజం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేలా చేశాయి. పవనుత్తాయి  అనే ఒక ఊరు మాస్ పాత్రలో ఆమె నటించిన తీరు , చెప్పిన డైలాగ్ డెలివరీ కూడా థియేటర్లలో చప్పట్లు కొట్టేలా చేస్తున్నాయి. ఫిబ్రవరి 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కేవలం పది రోజులలోనే 50 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి అందరిడే ఆశ్చర్యానికి గురిచేసింది.


ట్రెండ్ ఇలాగే కొనసాగితే కచ్చితంగా ఈ చిన్న సినిమా 100 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. 2026 సంవత్సరంలో ఇప్పటివరకు విడుదలైన తమిళ చిత్రాలలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన రెండవ సినిమాగా ఈ సినిమా నిలిచింది. హీరో శివ కార్తికేయన్ నిర్మాణంలో డైరెక్టర్ శివకుమార్ మురుగేషన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఆకట్టుకుంది. సినిమా కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు ఎలాంటి సినిమాకైనా బ్రహ్మరథం పడతారని మరొకసారి ఈ సినిమాతో నిరూపించారు. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో తాయికీళవి సినిమా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: