విజయ్- త్రిష విషయాలపై హీరోయిన్ ఖుష్బూ షాకింగ్ కామెంట్స్..!
ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఖుష్బూ మాట్లాడుతూ విజయ్, త్రిష మధ్య ఉన్నది వారి యొక్క వ్యక్తిగత విషయమని, దానిని పెద్ద ఇష్యూ చేయవలసిన పనిలేదని వారి వ్యక్తిగత జీవితం గురించి ప్రజలకు ఎందుకంత ఆసక్తి? వారి పనులు సామాన్య ప్రజల జీవితాన్ని ప్రభావితం చేయనంతవరకు మనం వాటి గురించి చర్చించాల్సిన అవసరం లేదు అంటూ తెలియజేసింది. త్వరలో తమిళనాడులో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో విజయ్ టీవీకే పార్టీ పెట్టి ప్రజలలోకి వెళ్తున్న తరుణంలో ఆయన ప్రతిష్టను దెబ్బతీసేలా రూమర్స్ వినిపిస్తున్నాయి.
అయితే ఈ విషయాలపైన ఖుష్బూని మాత్రం అడగగా ఓటు వేసేటప్పుడు ప్రజలు చాలా స్పష్టంగా ఆలోచిస్తారని నాయకుడు వ్యక్తిగత జీవితానికి ఆయన చేసే ప్రజాసేవకు మధ్య తేడాలను కూడా గుర్తిస్తారని తెలియజేసింది. ఆయన కూడా ఒక నేత అవ్వచ్చు..అంతకంటే ముందు ఆయన కూడా మనలాంటి ఒక మనిషి ఆయన వ్యక్తిగత జీవితంలోకి ప్రజలకు ఎటువంటి సంబంధం లేదని పరోక్షంగాని విజయ్ కు మద్దతుగా నిలిచినట్టుగా తెలియజేసింది ఖుష్బూ. ప్రస్తుతం ఈ విషయాలు మాత్రం వైరల్ గా మారుతున్నాయి. గడిచిన కొద్ది రోజుల నుంచి విజయ్ తన భార్య సంగీత విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. ఈ క్రమంలోని రోజురోజుకి ఈ విషయాల గురించి మరిన్ని వార్తలు వినిపిస్తున్నాయి.