అట్లీ–బన్నీ బిగ్ అప్‌డేట్.. ఫస్ట్ సర్‌ప్రైజ్ రెడీ!
బన్నీ బర్త్‌డే అంటేనే అభిమానులకు ఒక పండుగ. ఏప్రిల్ 8న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. ఈ గ్లింప్స్‌ను బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ డిజిటల్‌గా లాంచ్ చేయబోతున్నారనే వార్త ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. అట్లీతో ఉన్న సాన్నిహిత్యంతో షారుఖ్ ఈ వేడుకలో వర్చువల్‌గా పాల్గొనే అవకాశం ఉందట.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈ టీజర్‌కు అందిస్తున్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుందని సమాచారం. అట్లీ మార్క్ స్టైలిష్ విజువల్స్, బన్నీ మాస్ అప్పీల్ తోడైతే సోషల్ మీడియా బద్దలవ్వడం ఖాయం.
ఈ సినిమా కేవలం కమర్షియల్ మాస్ సినిమా మాత్రమే కాదు.. అట్లీ ఈసారి సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో ఒక ప్రయోగాత్మక కథను సిద్ధం చేశారట.టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో పాటు, తండ్రీకొడుకుల మధ్య సాగే ఎమోషనల్ డ్రామా ఈ సినిమాలో హైలైట్ కాబోతోంది. బన్నీ ఒక సూపర్ హీరో తరహా పాత్రలో కనిపిస్తారన్న ప్రచారం ఫ్యాన్స్‌కు కిక్ ఇస్తోంది. గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా, మృణాల్ ఠాకూర్ మరియు రష్మిక మందన్న కీలక పాత్రల్లో మెరవబోతున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా వేల కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఏప్రిల్ నెలలు అల్లు అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. మరి అట్లీ - బన్నీ కాంబోలో రాబోతున్న ఆ ‘గ్లింప్స్’ ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.ఈ ఏడాది చివర్లో మూవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.