ఏంటి బలగం హీరోయిన్ పెళ్లి పీటలెక్కబోతుందా.. అది కూడా కీరవాణి కొడుకుతో..ఇది నిజమేనా.. నిజంగానే ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారా.. అనేది ఇప్పుడు తెలుసుకుందాం. గంగోత్రి సినిమాతో టాలీవుడ్ లోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన కావ్య కళ్యాణ్ రామ్ తర్వాత చాలా సంవత్సరాలకి బలగం మూవీతో హీరోయిన్ గా మారింది. ఈ సినిమాలో కావ్య కళ్యాణ్ రామ్ పాత్రకి అంతగా ప్రాధాన్యత లేకపోయినప్పటికీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో కావ్య కళ్యాణ్ రామ్ పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత ఈమె నటించిన మసూద సినిమా కూడా బ్లాక్ బస్టర్..కానీ ఇందులో కూడా కావ్య కళ్యాణ్ రామ్ పాత్ర అంతంత మాత్రమే.. అయినా కూడా వరుస పెట్టి మంచి మంచి సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో ఓ మోస్తరు పేరు సంపాదించిన కావ్య కళ్యాణ్ రామ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు టాలీవుడ్ సినీ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ మధ్యకాలంలో చాలామంది సౌత్ హీరోలు వరుస పెట్టి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.అలా తాజాగా కావ్య కళ్యాణ్రామ్ కూడా పెళ్లి పీటలెక్కబోతున్నట్టు తెలుస్తుంది. అది కూడా ది గ్రేట్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి తనయుడు.. సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి కాలభైరవతో.. అవును మీరు వినేది నిజమే.టాలీవుడ్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. హీరోయిన్ కావ్య కళ్యాణ్రామ్ కాలభైరవ ఇద్దరూ చాలా రోజుల నుండి ప్రేమలో ఉన్నారట. అలా చాలా రోజులు ప్రేమలో ఉన్న ఈ లవ్ బర్డ్స్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్టు సమాచారం.
చాలా రోజుల నుండి ప్రేమలో ఉన్న కాలభైరవ, కావ్య కళ్యాణ్ రామ్ ల ప్రేమని ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇద్దరివి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కుటుంబాలే కావడంతో వీరి పెళ్లికి ఎలాంటి అడ్డు చెప్పలేదట. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎం.ఎం.కీరవాణి కి మంచి గౌరవ మర్యాదలు ఉన్నాయి.అలాంటి ఇంట్లోకి కోడలుగా వెళ్లడం కావ్య కళ్యాణ్ రామ్ అదృష్టమని ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇప్పటివరకు ఈ విషయాన్ని అటు కావ్య కళ్యాణ్రామ్ గానీ ఇటు కాలభైరవగానీ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఫిలిం సర్కిల్స్లో మాత్రం ఈ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఇక త్వరలోనే ఒక మంచి ముహూర్తం చూసుకొని ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం.