మేకప్ అక్కడ కూడా వేసుకోవాలని ఒత్తిడి చేశారు.. ఎన్టీఆర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!
అసలు రంగు కంటే మరింత తెల్లగా కనిపించాలని ముఖానికే కాకుండా ఎక్కడైతే బయట కనిపిస్తుందో అక్కడ శరీర భాగాలన్నీ కూడా మేకప్ వేసుకోవాలని చాలా ఒత్తిడి చేసేవారు అంటూ చెప్పుకొచ్చింది. అలా వాళ్ళు చెప్పడం వల్ల తాను అంత అందంగా ఉండనేమో అనే భావన కూడా చాలాసార్లు కలిగిందంటూ తెలియజేసింది సమీరారెడ్డి. అంతేకాకుండా ఎత్తు తక్కువగా ఉండడం వల్ల లావుగా ఉన్నానంటు చాలామంది విమర్శలు చేసేవాళ్లు సినీ పరిశ్రమలో టాలెంట్ కన్నా బాహ్య సౌందర్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం తనని చాలా బాధ కలిగించింది అంటూ వెల్లడించింది.
వివాహం తర్వాత మొదటి సంతానం అనంతరం పోస్ట్ పార్టం వెయిట్ గైన్ వల్ల తన ఆత్మవిశ్వాసం పూర్తిగా కోల్పోయానని అయితే ఆ సమయంలో సమాజం నుంచి చాలానే విమర్శలు ఎదురయ్యాయి కానీ రెండవసారి తల్లి అయినప్పుడు మాత్రం ఆ ఆలోచనలు పూర్తిగా మార్చేసుకున్నానంటూ వెల్లడించింది సమీరారెడ్డి. సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన తర్వాతే తనకు ఒక కొత్త సమస్య ఎదురయ్యిందని తెల్లబడిన తన జుట్టు పెరిగిన బరువును చూసి చాలా మంది తన దారుణంగా కామెంట్స్ చేసే వారిని, కానీ వాటిని నెమ్మదిగా పట్టించుకోవడమే మానేశానంటూ తెలిపింది. ప్రస్తుతం సమీరా రెడ్డి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.