టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు బోయపాటి?.. మాస్ సీక్వెల్ కోసం ప్లాన్!
రీసెంట్‌గా మన టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సన్నీ డియోల్ నటించిన ‘జాట్’ (Jaat) సినిమా టీజర్, సాంగ్స్ చూసిన వారందరూ.. "ఇది అచ్చం బోయపాటి సినిమా లాగే ఉంది" అని కామెంట్స్ చేశారు. ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే మేకర్స్ దీనికి సీక్వెల్‌ను అనౌన్స్ చేశారు. అయితే, పార్ట్ 2ను గోపీచంద్ మలినేని కాకుండా మరో డైరెక్టర్ తెరకెక్కిస్తారని వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం, ఆ ‘మరో డైరెక్టర్’ మరెవరో కాదు.. సాక్షాత్తు మన బోయపాటి శ్రీను అని తెలుస్తోంది. సన్నీ డియోల్ మాస్ ఇమేజ్‌కు, బోయపాటి యాక్షన్ టేకింగ్‌కు పక్కాగా సరిపోతుందని మేకర్స్ భావిస్తున్నారట.
సన్నీ డియోల్ ‘గదర్ 2’తో బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను ఎలా తిరగరాశారో మనకు తెలిసిందే. ఇప్పుడు ఆయనకు బోయపాటి మార్క్ ఎలివేషన్లు తోడైతే, బాలీవుడ్ జనాలు ఊగిపోవడం ఖాయం.బోయపాటి సినిమాలో ఉండే ఇంటెన్స్ ఫైట్లు, పవర్ ఫుల్ డైలాగులు సన్నీ డియోల్ బాడీ లాంగ్వేజ్‌కు పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి.ఈ క్రేజీ కాంబినేషన్ పై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఒక భారీ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.ఈ గ్యాప్‌లో బోయపాటి ఏకంగా బాలీవుడ్ సుల్తాన్‌తో ‘జాట్ 2’ ప్లాన్ చేయడం టాలీవుడ్ సత్తాను చాటిచెప్తోంది.