వరుణ్ మనియన్‌తో ఎంగేజ్‌మెంట్ రద్దు వెనక అసలు కారణం.. త్రిష ఓపెన్!

Amruth kumar
టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా రెండు దశాబ్దాలుగా వెండితెరను ఏలుతున్న ఏకైక సుందరి త్రిష కృష్ణన్. గ్లామర్ ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ అని అందరూ అంటుంటారు, కానీ త్రిష మాత్రం ఆ మాటను అబద్ధం చేస్తూ.. ‘ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్’ అని నిరూపిస్తోంది. తాజాగా చెన్నైలో జరిగిన ఒక వేడుకలో త్రిష సందడి చేయడం, ఆమె పర్సనల్ లైఫ్ గురించి తీసుకున్న బోల్డ్ నిర్ణయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ‘షూటింగ్’ స్టార్‌లా వైరల్ అవుతున్నాయి.



మార్చి 5న చెన్నైలో ప్రముఖ నిర్మాత కల్పతి ఎస్. సురేష్ కుమారుడి వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ మరియు త్రిష కలిసి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. గతంలో వీరిద్దరూ కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. అయితే విజయ్ వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్న వేళ, త్రిష ఆయనతో కలిసి ఒకే వేదికపై కనిపించడం ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్‌గా మారింది. ఆ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.



త్రిష జీవితంలో అత్యంత సాహసోపేతమైన నిర్ణయం ఏంటంటే.. ఆమె తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవడం. 2015లో వ్యాపారవేత్త వరుణ్ మనియన్‌తో త్రిషకు ఎంగేజ్‌మెంట్ జరిగింది. కానీ పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలని ఆయన కండిషన్ పెట్టారట. "సినిమాలకు కాదు, నా ఎంగేజ్‌మెంట్‌కే ఫుల్ స్టాప్ పెట్టాను" అని త్రిష అప్పట్లో ధైర్యంగా చెప్పింది. తన ఇష్టాలను చంపుకుని బంధం కోసం కెరీర్‌ను వదులుకోనని ఆమె నిరూపించింది. ఈ డెడికేషన్ చూసి అప్పట్లో అంతా షాక్ అయ్యారు.



సాధారణంగా పెళ్లి చేసుకోకుండా కెరీర్‌ను కొనసాగించడం సినీ ఫీల్డ్‌లో అంత ఈజీ కాదు. కానీ త్రిష మాత్రం తన ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతోంది. "నా చివరి శ్వాస వరకు నేను నటిస్తూనే ఉండాలన్నదే నా కోరిక" అని త్రిష చాలా సందర్భాల్లో చెప్పింది. త్రిష మాత్రం తన స్టైల్ లో సైలెంట్‌గా సినిమాలు చేసుకుంటూ పోతోంది. నేటి తరం నటీమణులకు ఆమె ఒక ఇన్స్‌పిరేషన్. అందం కంటే ఆత్మవిశ్వాసం గొప్పదని, తన కాళ్ళ మీద తాను నిలబడటం ముఖ్యమని త్రిష నిరూపిస్తోంది., త్రిష కూడా తన గ్లామర్ అండ్ పెర్ఫామెన్స్ తో అదే స్థాయిలో దూసుకుపోతోంది. మరి విజయ్‌తో కలిసి ఆమె చేసిన సందడి మున్ముందు ఇంకెన్ని సినిమాల వైపు దారితీస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: