చిరంజీవికి అన్న పాత్రలో ఆ స్టార్ హీరో ..ఇక ధియేటర్స్ లో రచ్చ రంబోలానే..!?
చిరంజీవికి అన్నయ్యగా కనిపించే పాత్రకు రజనీకాంత్ అయితేనే సరైన ఎంపిక అవుతారని దర్శకుడు భావించినట్టు చెబుతున్నారు. ఇద్దరి మధ్య ఉన్న స్టార్డమ్, వారి స్క్రీన్ ప్రెజెన్స్, అలాగే అభిమానుల్లో ఉన్న క్రేజ్ అన్ని కలిసి ఈ పాత్రను మరింత గొప్పగా చూపిస్తాయని ఆయన నమ్మకం. ఈ విషయంపై చిరంజీవి స్వయంగా రజనీకాంత్‌తో మాట్లాడినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. కథ వినిపించిన తర్వాత రజనీకాంత్ కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.ఇక ఈ సినిమాలో ఇప్పటికే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నారని తెలిసింది. ఆయన పాత్ర కూడా కథలో కీలక మలుపు తిప్పే విధంగా ఉంటుందని సమాచారం. చిరంజీవి, మోహన్ లాల్ వంటి దిగ్గజ నటులతో పాటు రజనీకాంత్ కూడా ఈ సినిమాలో భాగమైతే, అది నిజంగా భారతీయ సినీ పరిశ్రమలో ఒక అరుదైన కలయికగా మారుతుంది అని అభిమానులు భావిస్తున్నారు.
ఇలాంటి స్టార్ కాంబినేషన్ ఒకే సినిమాలో కనిపించడం చాలా అరుదు. అందుకే ఈ సినిమా గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకే తెరపై చిరంజీవి, రజనీకాంత్, మోహన్ లాల్ లాంటి స్టార్లు కనిపిస్తే అది ఖచ్చితంగా ఇండియా వైడ్‌గా భారీ సంచలనంగా మారే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.