ఉస్తాద్ భగత్ సింగ్: ఏపీలో బెనిఫిట్ షో.. టికెట్ ధర ఎంతంటే..?
మార్చి 19న తెల్లవారుజామున 4-5 గంటల మధ్యలో బెనిఫిట్ షో వేసుకునేందుకు అనుమతి ఇవ్వగా టికెట్ ధరను రూ .500 రూపాయలుగా నిర్ణయించారు. మరో 10 రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకునే అవకాశం కల్పించింది. సింగిల్ స్క్రీన్ లలో రూ .100 రూపాయలు, మల్టీప్లెక్స్ లలో రూ.125 రూపాయలు చొప్పున పెంచుకునే అవకాశం కల్పించింది. అంటే మార్చి 19వ తేదీ నుంచి మార్చి 28వ తేదీ వరకు ఈ ధరలు అమలులో ఉంటాయి.
గత కొంతకాలంగా అగ్ర హీరోల చిత్రాలకు స్పెషల్ ప్రీమియం పేరుతో ముందు రోజు రాత్రి నుంచే షోలు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో దురంధర్ 2 సినిమా మరో రెండు అడుగులు ముందుగానే ఉంది. ఉస్తాద్ సినిమా మార్చి 19న బెనిఫిట్ షో అనుమతి ఇచ్చిన నేపథ్యంలో అసలు ముందు రోజు షో ఉంటుందా?లేదా అనే విషయం పైన ఇంకా క్లారిటీ రాలేదు. ఇటీవల సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది ఎలాంటి కట్స్ లేకుండా యూ/ఏ సర్టిఫికెట్లు కూడా వచ్చినట్లు చిత్ర బృంద ప్రకటించారు. ఈ సినిమా రన్ టైం విషయానికి వస్తే 2 గంటల 34 నిమిషాలు ఉన్నది ఇందులో శ్రీ లీల ,రాశి ఖన్నా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరి ఏ మేరకు అభిమానులను ఆకట్టుకుంటుందో చూడాలి మరి.