ఆ థియేటర్ పై ఈర్ష్య.. అందుకే అల్లు సినిమాస్ ని నిర్మించానంటున్న అల్లు అరవింద్.!

Pandrala Sravanthi
అల్లు అరవింద్..ప్రముఖ కమెడియన్ అల్లు రామలింగయ్య వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి నిర్మాతగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం ఉన్న దిగ్గజ నిర్మాతలలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. అయితే అలాంటి అల్లు అరవింద్ తాజాగా అల్లు సినిమాస్  ని ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అల్లు సినిమాస్  ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంతోమంది సినీ దిగ్గజాలు కూడా తరలివచ్చారు. అయితే ఓవైపు బిజినెస్ చూసుకుంటూ మరోవైపు సినిమాలకు ప్రొడ్యూస్ చేస్తూ ఇంకోవైపు గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థను నడిపిస్తూ బిజీ బిజీగా ఉన్న అల్లు అరవింద్ థియేటర్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టడానికి ప్రధాన  కారణాలు రెండు ఉన్నాయట. ఆ రెండు కారణాలవల్లే ఈరోజు అల్లు సినిమాస్ ని ప్రారంభించారట. మరి ఇంతకీ అల్లు అరవింద్ స్టూడియో ని ప్రారంభించడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 


అల్లు అరవింద్ తాజాగా హైదరాబాదులోని కోకాపేటలో అల్లు సినిమాస్  ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. నేను అల్లు సినిమాస్ ని నిర్మించడానికి రెండే ముఖ్య కారణాలు ఉన్నాయి. అవి ఒకటి సూళ్లూరుపేటలో వంశీ కట్టిన యు.వి. క్రియేషన్స్ అనే అతిపెద్ద థియేటర్ ..ఈ థియేటర్ చూశాక నాక్కూడా ఒక పెద్ద థియేటర్ కట్టాలి అనే కోరిక కలిగింది. అలా అల్లు సినిమాస్  ని నిర్మించడానికి ప్రధాన కారణం ఇదే.అలాగే గతంలో ఓ బడా బిజినెస్ మాన్ మిషన్ ఇంపాజిబుల్ 6  అనే సినిమాని ప్రసాద్ PCX స్క్రీన్ లో చూడడానికి ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ కావాలని ప్రాధేయపడడం..


 ఈ రెండు కారణాలు నన్ను థియేటర్ బిజినెస్ లోకి అడుగు పెట్టేలా చేశాయి. అంటూ అల్లు అరవింద్ అల్లు సినిమాస్  నిర్మించడానికి రెండు ప్రధాన కారణాలను బయటపెట్టారు.. ఇక అల్లు సినిమాస్  లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా ఏషియా లోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ ఉన్న మొట్ట మొదటి థియేటర్ ఇదే.. ఈ థియేటర్లో మొత్తం నాలుగు స్క్రీన్లు ఉండగా ఒక్కటి మాత్రమే డాల్బీ స్క్రీన్ ఉందని తెలుస్తుంది... ఇక ఈ థియేటర్లో విడుదలయ్యే మొట్టమొదటి మూవీ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్.. అలాగే దురంధర్ సినిమా కూడా విడుదల కాబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ థియేటర్ టికెట్ కాస్ట్ 450 రూపాయలని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: