‘భారతీయుడు 3’ ఫ్యూచర్ ఏంటి?.. శంకర్‌కు మరో టెన్షన్!

Amruth kumar
టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక ఐకానిక్ సినిమాగా నిలిచింది “భారతీయుడు”. శంకర్ విజన్, కమల్ హాసన్ విశ్వరూపం తోడైతే బాక్సాఫీస్ ఎలా షేక్ అవుతుందో ఆ సినిమా నిరూపించింది. అయితే, ఏళ్ల తర్వాత వచ్చిన సీక్వెల్ “భారతీయుడు 2” మాత్రం ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యి, అటు శంకర్ ఇమేజ్‌ను, ఇటు కమల్ క్రేజ్‌ను దారుణంగా దెబ్బతీసింది. ఇప్పుడు ఈ సెగ “భారతీయుడు 3” పీకల దాకా వచ్చింది.



నిజానికి ‘భారతీయుడు 2’తో పాటే పార్ట్ 3 షూటింగ్ కూడా చాలా వరకు పూర్తయ్యింది. పార్ట్ 2 చివరలో చూపించిన ట్రైలర్ చూసి, "అసలు ఈ కంటెంట్ కదా ముందు రావాల్సింది" అని ఆడియన్స్ ఫీలయ్యారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. పార్ట్ 2 రిజల్ట్ చూసి షాక్ అయిన లైకా ప్రొడక్షన్స్, ఇప్పుడు పార్ట్ 3 పై పైసా కూడా పెట్టలేమని తెగేసి చెప్పేస్తున్నారట. ఒకవేళ సినిమా రిలీజ్ చేయాలంటే శంకర్ లేదా కమల్ హాసన్ లు ఓన్ రిస్క్‌తో పూర్తి చేసుకోవాలని లైకా వర్గాలు అంటున్నట్టు టాక్.



ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది! ఒకవేళ శంకర్ ‘భారతీయుడు 3’ని ఫినిష్ చేయకుండా వేరే సినిమాలపై దృష్టి పెడితే.. ఆయనపై లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలని లైకా ప్లాన్ చేస్తోందట. పెట్టిన పెట్టుబడి వెనక్కి రాకపోవడంతో ప్రొడక్షన్ హౌస్ ఇప్పుడు చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది.ఒకప్పుడు శంకర్ సినిమా అంటే ₹1000 కోట్ల మార్కెట్ ఉండేది. కానీ ‘భారతీయుడు 2’ ఫలితం ఆయన కెరీర్‌లోనే పెద్ద మచ్చగా మిగిలిపోయింది.యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ఈ వయస్సులో అంత మేకప్ వేసుకుని కష్టపడినా, ఆడియన్స్ నుంచి సరైన రెస్పాన్స్ రాకపోవడం విచారకరం.



భారీ ఎత్తున ప్లాన్ చేసిన పార్ట్ 3 రిలీజ్ ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. అసలు ఈ సినిమా థియేటర్ల వరకు వస్తుందా లేదా అనేది కోలీవుడ్ వర్గాల్లో పెద్ద డిస్కషన్ పాయింట్ అయ్యింది.శంకర్ చుట్టూ ముసురుతున్న ఈ వివాదం టాలీవుడ్‌లో కూడా హాట్ టాపిక్‌గా మారింది.ఒకవేళ శంకర్ కానీ భారతీయుడు 3 పూర్తి చేయకుండా వేరే సినిమా మొదలు పెడితే మాత్రం తనపై లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలని చూస్తున్నట్టు కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మరి ఈ తతంగం అంతా ఎక్కడికి వెళుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: