రామ్ చరణ్ బర్తడే.. ఫాన్స్ కి డబుల్ ట్రీట్..!

Divya
పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ ఫ్యాన్ ఫాలోయింగ్  ఏ విధంగా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తండ్రికి తగ్గట్టుగానే తన సినిమాలతో తనని తాను నిరూపించుకుంటున్నారు. అద్భుతమైన నటనతో డాన్స్ తో తనదైన ముద్ర వేసుకున్న రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో  ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో పెద్ది సినిమాలో నటిస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తూ ఉండగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు.



ఇదంతా ఇలా ఉండగా మార్చి 27న చరణ్ పుట్టిన రోజు సందర్భంగా చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేసుకోవడానికి మెగా ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా చరణ్ సినిమాల అప్డేట్ కోసం అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న ప్రకారం ఈ ఏడాది రామ్ చరణ్ అభిమానులకు డబుల్ ట్రీట్ ఉండనున్నట్లు టాకు వినిపిస్తోంది. పెద్ది సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ రాబోతున్నట్టు సమాచారం. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా పెద్ది సినిమా టీజర్ ని రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వినిపిస్తున్నాయి.



అలాగే డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో కూడా మరో ప్రాజెక్టు చేయడానికి సిద్ధమైన రామ్ చరణ్ ఆర్సి 17 వర్కింగ్ టైటిల్స్ తో ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే జరుగుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించి టైటిల్ లేదా ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈసారి మాత్రం రామ్ చరణ్ బర్తడే కు మెగా అభిమానులకు డబుల్ ట్రీట్ ఉండనున్నట్లు వినిపిస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే రామ్ చరణ్ బర్తడే వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: