హీరో కమలహాసన్ పై సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్..!
వైరముత్తుకి అవార్డు దక్కిన వార్త బయట రాగానే ప్రముఖ సింగర్ గా పేరు సంపాదించిన చిన్మయి సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. గతంలో వైరముత్తు పైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ఈమె ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. కేవలం వైరముత్తునే కాకుండా ఆయన సమర్థించినటువంటి సిని ,రాజకీయ దిగ్గజాలను కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది చిన్మయి. ఇటీవలే వైరముత్తును అభినందిస్తూ హీరో కమల్ హాసన్ పెట్టిన పోస్టును చిన్మయి టార్గెట్ చేస్తూ జయకాంతన్ తర్వాత 20 ఏళ్లకు ఒక తమిళుడికి ఇలాంటి గౌరవం దక్కడం తమిళనాడుకే గర్వకారణం అంటూ, తనకి వైరముత్తు ఆప్త మిత్రుడు అంటూ కూడా కమలహాసన్ పేర్కొన్నారు.
అయితే ఈ విషయం పైన సింగర్ చిన్మయి స్పందిస్తూ కమలహాసన్ వంటి వ్యక్తుల ద్వంద ప్రమాణాలను ఎండగట్టారు.. సినిమా పరిశ్రమ నుంచి రాజకీయాలలోకి వచ్చిన వారెవరు కూడా బాధితుల గోడును వినడానికి నిరాకరిస్తున్నారు. పురుషులు ఎప్పుడూ కూడా తమ పురుషుల వైపే నిలబడతారనే విషయాన్ని మహిళలు గుర్తించాలి అంటూ ఘాటుగా చిన్మయి విమర్శించారు. తాను నిజాలు మాట్లాడినందుకే తమిళ సినీ పరిశ్రమలో నిషేధాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎంతోమంది మహిళా గొంతులను తొక్కేస్తున్నారంటూ చిన్మయి ఆవేదనని తెలియజేస్తోంది. తమిళ ఇండస్ట్రీలో చాలామంది మహిళలు తమ కలలను వదులుకున్నారు వారి ఆవేదన ఎవరికి పట్టదా? పురుషులు తమ స్నేహితుల కోసమే నిలబడతారని చెప్పడానికి ఇదే ఒక నిదర్శనం అంటూ చిన్మయి రియాక్ట్ అయ్యింది.