పవన్ కళ్యాణ్ సినిమాకి శ్రీలీల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Divya
టాలీవుడ్ స్టార్ హీరోలకు హీరోయిన్గా నటిస్తూ భారీ పాపులారిటీ సంపాదించుకుంది శ్రీలీల.మొదటిసారి పెళ్లి సందD సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎన్నో సినిమాలలో నటించి సత్తా చాటింది. ఆ తర్వాత గుంటూరు కారం, ధమాకా, స్కంధ, జూనియర్, తదితర చిత్రాలలో నటించింది. నిరంతరం ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం మార్చి 19వ తేదీన విడుదల కాబోతోంది.


ఇందులో మరొక హీరోయిన్ రాశి ఖన్నా  కూడా నటించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా శ్రీ లీల గురించి ఒక క్రేజీ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. అదేమిటంటే ఈ సినిమా కోసం శ్రీలీల రూ .3 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే గత సినిమాలతో పోలిస్తే ఇది తక్కువే అయినప్పటికీ శ్రీ లీల నటించిన జూనియర్ చిత్రానికి ఏకంగా రూ .4కోట్ల రూపాయల వరకు తీసుకున్నట్లు సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ సినిమాకు తక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడానికి పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ రావడం కష్టమే కాబట్టి అందుకే రెమ్యూనరెషన్ తగ్గించుకొని మరి నటించిందని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.


శ్రీలీల కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ వైపుగా కూడా ప్రత్యేకించి మరీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ కార్తీక్ ఆర్యన్ సరసన ఒక సినిమాలు ఇబ్రహీం ఆలీతో కూడా మరో సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. శ్రీలీల ఎన్నో చిత్రాలలో తెలుగులో నటించినప్పటికీ తనకి సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతోంది. కానీ ప్రతి సినిమాతో మాత్రం అభిమానులను అలరిస్తూనే ఉంది. మరి పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఏ మేరకు శ్రీలీల కెరీర్ కి ఉపయోగపడుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: