టికెట్ల రేటు పై.. పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్..!

Divya
డైరెక్టర్ హరి శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఇందులో శ్రీలీల, రాశిఖన్నా పవన్ కళ్యాణ్ కు జోడిగా నటిస్తున్నారు. భారీ అంచనాలతో మార్చి 19వ తేదీన ఉగాది కానుకగా ఈ సినిమా విడుదల కాబోతోంది. మార్చి 15న ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాదులో చాలా ఘనంగా జరిగింది. ఇక ఈ సినిమాకి పనిచేసిన వారితో పాటుగా పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు సినీ సెలబ్రిటీలకు కూడా ఈవెంట్ కి హాజరయ్యారు.


అయితే ఈవెంట్లో పలు అంశాలపై మాట్లాడుతూ సినిమా టికెట్ల ధరల పెంపు విషయం పైన కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్క హీరో సినిమాలు బాగుండాలి. సినిమా టికెట్ల రేట్లు పెంచడంపై కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు సినిమా కంపల్సరీ కాదు, మేము గన్ పెట్టి చూడమని ఎవరికీ చెప్పలేదు కదా! మొదటి రోజు చూడాలని ఏమీ లేదు.. నేను నా సినిమాలకు తక్కువ రేట్లు ఇచ్చుకొని మరి కల్కి, పుష్ప వంటి సినిమాల హీరోలకు ఎక్కువ రేట్లు ఇచ్చాను. సినిమా టికెట్లు రేటు పెంచిన దానిపైన 18 శాతం జీఎస్టీ ప్రభుత్వానికి వస్తుంది. అలాగే వదిలేస్తే బ్లాక్లో టికెట్లు అమ్మేసుకుంటున్నారు ఆ డబ్బులు ఎటు పోతున్నాయో తెలియడం లేదు.


అందుకే అన్ని ఆలోచించి హీరో ఎవరైనా సరే సంబంధం లేకుండా సినిమా వచ్చిన టికెట్లు రేటు పెంచడానికి పర్మిషన్ ఇస్తున్నారని తెలిపారు. కర్ణాటకలో తెలుగు సినిమా పోస్టర్లు చించినా కూడా ఇక్కడ ఇండస్ట్రీలో అందరూ బాగుండాలని నేను కాంతారా సినిమాకు పరిమిషన్ ఇచ్చాను, సినిమా ఇండస్ట్రీ అంటే బాగుండాలి, ఫ్యాన్స్ వార్ తాను చూస్తూనే ఉంటాను ఆన్లైన్లో అలా చేయడం కరెక్ట్ కాదు. నేను ఒక హీరోగా చెబుతున్నాను అందరి హీరోల అభిమానులను గౌరవిస్తాను ఏ హీరోతో కూడా తనకు విభేదాలు లేవని, ప్రతి ఒక్క హీరో కూడా హిట్స్ కొట్టాలి నేను చాలా సార్లు చెప్పాను ఒక హీరోగా నిర్మాతలు బాగుండాలని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: