ఆ హీరోయిన్ ను రాజకీయాలలోకి రమ్మన్న పవన్ కళ్యాణ్.. ఎవరంటే..?

Divya
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాలు చేస్తూనే మరొకవైపు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అలాగే జనసేన పార్టీ అధినేతగా బాధ్యతలు వ్యవహరిస్తూ, మరొకవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా అన్ని విధాలుగా ముందుకు వెళ్తున్నారు. అయితే ఇటువంటి సందర్భంలోనే పవన్ కళ్యాణ్ ఒక హీరోయిన్ ని రాజకీయాలలోకి రమ్మని సలహా ఇచ్చినట్లుగా ఆ హీరోయిన్ సరదాగా చెప్పుకొచ్చింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు హీరోయిన్ రాశి ఖన్నా.


ప్రస్తుత తెలుగు, తమిళ్ ,హిందీ వంటి చిత్రాలలో కొన్ని సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా ఇమే హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ తో ఉన్న ఒక స్వీట్ మూమెంట్ ని అభిమానులతో పంచుకుంది. పవన్ కళ్యాణ్ తనను స్వయంగా రాజకీయాలలోకి రమ్మని సలహా ఇచ్చారని వెల్లడించింది. ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతున్న సందర్భంలో ఆయన మీరు సినిమాలలోకి రావాలనుకున్నారా? లేకపోతే నటనలోకి రాకముందే మరేమైనా కావాలనుకున్నారా అని ప్రశ్నించారని.


దాంతో ఆమె తాను ఐఏఎస్ అవ్వాలనుకున్నాను కానీ అది కుదరకపోవడం వల్లే తాను సినిమాలలోకి వచ్చారని తెలిపిందట. అనంతరం వెంటనే పవన్ కళ్యాణ్ ఐఏఎస్ అవడం కుదరలేని పక్షంలో రాజకీయాల్లోకి రావచ్చు కదా; అలా అయినా ప్రజలకు సేవ చేయొచ్చు కదా అని సలహా ఇచ్చారట. అయితే ఆ వెంటనే రాశి ఖన్నా రాజకీయాలు తన వల్ల కావని చెప్పేశానని తెలియజేసింది. ప్రస్తుత ఈ ముద్దుగుమ్మ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ విషయం పైన అటు పవర్ అభిమానులు రాశి ఖన్నా అభిమానులు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇవే కాకుండా పలు చిత్రాలలో కూడా నటిస్తోంది ఏమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: