థమన్ సౌండ్ బ్లాస్ట్.. హరీష్ శంకర్ హైప్ పెంచేశాడు!
ఈ సినిమాకు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన పాటలు అందించగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాధ్యతను ఎస్‌ఎస్ థమన్ భుజానికెత్తుకున్నారు.థమన్ బిజిఎం పనులను పూర్తి చేసిన సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్ ‘హెర్క్యులియన్ ఎఫర్ట్’ అంటూ కొనియాడారు .. థమన్ ఇచ్చే ఆ ‘సౌండ్’ దెబ్బకు థియేటర్లలో సౌండ్ బాక్సులు పేలిపోవాల్సిందేనని మేకర్స్ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు . . . ఫైనల్ అవుట్‌పుట్ చూశాక హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ‘ఉస్తాద్’ తన ప్రతాపం చూపడానికి సిద్ధమని హింట్ ఇచ్చారు . . .
మార్చి 19న విడుదల కాబోతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి . .అన్ని ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో మొదలయ్యాయి . . . ఇప్పటికే లక్షలాది టిక్కెట్లు అమ్ముడైపోయి, ‘ఉస్తాద్’ స్టామినా ఏంటో చూపిస్తున్నాయి.మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా గ్లామర్ అదనపు ఆకర్షణ కానుంది . . పార్థిబన్, గౌతమి వంటి సీనియర్ నటుల నటన సినిమాకు బలాన్ని చేకూర్చనుంది.పవర్ స్టార్ సినిమా విడుదల అంటే అది ఒక టాలీవుడ్ సెలబ్రేషన్ . . !