మెంటల్ ఎక్కించే డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి..ఇక రచ్చ రంబోలానే..!?

Thota Jaya Madhuri
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న దర్శకుడు హరీష్ శంకర్, తాజాగా మెగాస్టార్ చిరంజీవితో చేయబోయే ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. చాలా కాలంగా అభిమానులు ఎదురుచూస్తున్న ఈ కాంబినేషన్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ఈ సినిమా కేవలం ఒక సాధారణ కమర్షియల్ ఎంటర్‌టైనర్ కాకుండా, అభిమానులు ఆశించే పూర్తి స్థాయి "వింటేజ్ చిరంజీవి"ని తిరిగి తెరపై చూపించే ప్రయత్నమని వెల్లడించారు. గతంలో చిరంజీవి చేసిన రౌడీ అల్లుడు, దొంగ మొగుడు, గ్యాంగ్ లీడర్ వంటి చిత్రాల్లో కనిపించిన మాస్ మేనరిజమ్స్, స్టైల్, కామెడీ టైమింగ్ ని గుర్తు చేసేలా కథను డిజైన్ చేస్తున్నట్లు తెలిపారు.

“ఒక నిజమైన మెగా అభిమాని మెగాస్టార్‌ను ఎలా చూడాలనుకుంటాడో, ఆ విధంగానే ఈ సినిమా ఉంటుంది” అని ఆయన చెప్పడం అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. ముఖ్యంగా చిరంజీవి ప్రత్యేకమైన ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్ స్టైల్ ను మళ్లీ అదే పాత మేజిక్‌తో చూపించాలనే లక్ష్యంతో హరీష్ శంకర్ ఈ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కథ గురించి అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించకపోయినా, ఇది పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే ఇందులో యాక్షన్, ఎమోషన్, కామెడీ అన్నీ సమతౌల్యంగా ఉండేలా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని సమాచారం.

ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశముంది. ఈ కాంబినేషన్ సెట్ అయితే, ఇది మెగా అభిమానులకు నిజంగా ఒక పండుగలా మారనుందనే చెప్పాలి. మొత్తానికి, హరీష్ శంకర్ మాటలు చూస్తే, చిరంజీవిని మరోసారి పాత స్టైల్‌లో చూడబోతున్నామనే ఉత్సాహం అభిమానుల్లో రోజురోజుకూ పెరుగుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: