దురంధర్ 2 రివ్యూ: బొమ్మ ఎలా ఉందంటే? క్లైమాక్స్ మైండ్ బ్లాక్..!
స్టోరీ:
పాకిస్తాన్లో రహమాన్ డెకాయిత్(అక్షయ్ ఖన్నా) మరణించిన తర్వాత గ్యాంగ్ వార్ ముదురుతుంది. అండర్ కవర్ ఏజెంట్గా పాకిస్తాన్లో వెళ్లిన జస్మిరత్ సింగ్ అసలు అక్కడికి ఎందుకు వెళ్లారు? ఎవరు పంపించారు? హంజా హలీ మజారిగా (రణవీర్ సింగ్) ఎందుకు మారాల్సి వచ్చింది అనేది ఈ సినిమా స్టోరీ. పాకిస్తాన్ లోకి వెళ్ళిన తర్వాత దావూద్ ఇబ్రహీం సిండికేట్, పాకిస్తాన్ రాజకీయాలను తన గుప్పెట్లోకి తీసుకొని, 26/11 ముంబై దాడులకు హంజా ఇలాంటి ప్రతికారం తీర్చుకున్నారు? పాకిస్తాన్లో హంజా ఒక బలమైన శక్తిగా ఎలా ఎదిగారు. పోలీస్ ఆఫీసర్ ఎస్పీ అస్లాం చౌదరి (సంజయ్ దత్), ఐబీచీఫ్ అజయ్ సన్వాల్ (మాధవన్) , మెజార్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) పాత్రలు మిషన్ ని ఎలా పూర్తి చేశారు అన్నది మిగతా స్టోరీ.
కథనం:
దురంధర్ 2 సినిమా కేవలం ఒక యాక్షన్ సినిమానే కాకుండా పాలిటిక్స్, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కలిగిన ఒక మాస్టర్ క్లాస్ సినిమా. మొదటి భాగంలో రెహమాన్ పాత్ర లేని లోటును చాలా ఎమోషనల్ గా, ఆపరేషన్లుగా ఈ సీక్వెల్లో ఫీల్ చేసింది. హీరోగా హంజా ఎంట్రీ ఈ సినిమాకు మరింత ప్రాణం పోసిందని చెప్పవచ్చు. ఒక రా హ్యాండర్లను ఉత్కంఠ భరితంగా మట్టుబెట్టే సీన్స్ లో తన మార్క్ చూపించారు హాంజా. దేశ భద్రత కోసం చేసే పోరాటాన్ని చాలా సహజంగా ధైర్యంగా చూపించారు డైరెక్టర్ ఆదిత్యధర్. పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి ముఖ్యంగా పంజాబ్ ,యుపి వంటి రాష్ట్రాలలో టెర్రరిజం, డ్రగ్స్ ఎలా నడిపిస్తారనే వాస్తవాలను చాలా ధైర్యంగా చూపించారు. అలాగే యూపీ యువతను బ్రెయిన్ వాష్ ఎలా చేస్తారు అనే వాటిని కూడా చూపించారు. ఇలాంటి టెర్రర్ నెట్వర్క్ ని హంజా ఒక్కొక్కటిగా దెబ్బతీస్తున్న సమయంలో ఐఎస్ఐకి అతనిపైన అనుమానం పెరగడం మరింత ఉత్కంఠ పరుస్తుంది. ఆ సమయంలోనే హంజా భార్య అతని సీక్రెట్ డైరీ చూడడం అనేది కథలో మరింత ఎమోషనల్ కి తీసుకెళ్తుంది. ఈ సినిమా ఓవరాల్ గా సాలిడ్ రివెంజ్ డ్రామా దేశం కోసం చేసే ఒక పోరాటం కళ్ళకు కట్టే పవర్ఫుల్ ఎమోషనల్ సినిమా.సినిమాలోని డైలాగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి, క్లైమాక్స్ లో వచ్చే ట్రస్టులు అసలు ఊహించలేరు మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటాయి. ఈ సినిమాకి కలెక్షన్స్ తో పాటుగా అవార్డులు కూడా రావడం ఖాయమని నేటిజన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు.
నటీనటులు:
రణవీర్ సింగ్ వన్ మ్యాన్ షో , హంజా పాత్ర రణబీర్ తప్ప మరెవరు కూడా చేయలేనంతగా నటించారు. ఇందులో యాక్షన్ సీన్స్ తన కెరియర్ లోనే బెస్ట్, ఎస్పీ అస్లాంగా సంజయ్ దత్ మరోసారి అదరగొట్టేశారు. అలాగే ఐబీ చీఫ్ గా మాధవన్, మేజర్ గా అర్జున్ రాంపాల్ రాంపాల్ స్టైల్ తో సినిమాకి మరింత ప్రాణం పోశారు. సారా అర్జున్ తన నాచురల్ యాక్టింగ్ తో మరింత ఆకట్టుకుంది.
శాశ్వత సచ్ దేవ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి హైలెట్. ఈ సినిమాలో బ్లడ్ షేడ్, వైలెన్స్ చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ డైరెక్టర్ ఆదిత్యధర్ చాలా పకడ్బందీగా ఈ సినిమాను తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉంది. 3 గంటల 49 నిమిషాల రన్ టైం ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా అద్భుతంగా తెరకెక్కించారు.
రేటింగ్:
3/5