దురంధర్ 2: ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే..?

Divya
బాలీవుడ్లో మోస్ట్ అవైడెడ్ చిత్రంగా నిలిచిన చిత్రం దురందర్ 2. ఈ సినిమా భారీ అంచనాల మధ్య మార్చి 19న విడుదలయ్యింది. అయితే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషలలో అదే రోజున విడుదల చేయాలని చిత్ర బృందం ప్రకటించింది. అయితే కొన్ని కారణాల చేత ఇతర భాషలలో విడుదల చేయలేకపోయింది. కేవలం హిందీ వర్షన్ లో మాత్రమే అన్ని ప్రాంతాలలో విడుదల చేసింది. ప్రీమియర్ షో నుంచే పాజిటివ్ టాక్ తో దురంధర్ 2 సినిమా దూసుకుపోయింది.ఇక సెకండ్ హాఫ్ లో అయితే ఆడియన్స్ షాక్ అయ్యేలా సినిమా ఉందంటూ తెలియజేస్తున్నారు.


దేశవ్యాప్తంగా దురంధర్ 2 సినిమా కోసం ప్రేక్షకులు థియేటర్ల వద్ద భారీ స్థాయిలోనే క్యూ కట్టారు. హిందీలో కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి భారీగానే ఓపెనింగ్స్ రాబట్టాయి. అయితే బాలీవుడ్ లో అందుతున్న సమాచారం ప్రకారం దురంధర్ 2 చిత్రానికి ప్రీమియర్స్, ఫస్ట్ డే కలెక్షన్స్ దాదాపుగా రూ .170 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు వినిపిస్తోంది. ఇక ప్రీమియర్స్ షో నుంచే రూ .42 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిందని, మొదటి రోజు రూ .130 కోట్ల వరకు గ్రాస్ వస్తువులు సాధించినట్లు వినిపిస్తోంది.


హిందీలో 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ , రెండు తెలుగు రాష్ట్రాలలో మూడు కోట్లకు పైగా కేవలం హిందీ లాంగ్వేజ్తోనే కలెక్షన్స్ సాధించింది. ఇండియాలోని ఫస్ట్ హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించిన పుష్ప 2 చిత్రం 294 కోట్లతో టాప్ లో ఉంది. ఆ తర్వాతి స్థానాలు ఆర్ఆర్ఆర్, బాహుబలి, కల్కి వంటి చిత్రాలు ఉన్నాయి. దురంధర్ చిత్రం కేవలం హిందీలో మాత్రమే విడుదలై 1300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. మరి దురంధర్ 2 ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి. ఇందులో రణవీర్ సింగ్ నటించిన తీరు అందరి చేత ప్రశంసలు అందుకునేలా చేస్తోంది. డైరెక్టర్ ఆదిత్యధర్ ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: