ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే..?
ఇక ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే.. రూ. 37.17 కోట్ల రూపాయల గ్రాస్ నమోదైనట్లు సమాచారం ఇందులో రూ. 31.50 కోట్ల రూపాయల నెట్వర్క్ వసూలు చేసినట్లు సమాచారం. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్ మేనరిజంతో ఈ సినిమా అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఇందులో పవన్ కళ్యాణ్ కి జోడిగా శ్రీ లీల, రాశి ఖన్నా నటించారు. అలాగే బాలీవుడ్లో భారీ విజయాన్ని అందుకున్న దురంధర్ సినిమాకి సీక్వెల్ గా దురంధర్ 2 సినిమా మార్చి 19న విడుదల కావడం చేత ఈ సినిమా కలెక్షన్స్ పైన ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి ఇండియా వైడ్ గా 5,359 షోలు వేయగా రూ. 37.17 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఏపీలో పవన్ కళ్యాణ్ స్టామినా తగ్గట్టుగానే రూ.19.40 కలెక్షన్స్ తో పర్వాలేదు అనిపించింది. తెలంగాణలో మాత్రం ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టలేదని అక్కడి కేవలం రూ. 9.10 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టినట్లుగా వినిపిస్తున్నాయి. మరి ఫైనల్ గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అఫీషియల్ గా చిత్ర బృందం కలెక్షన్స్ పైన క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.