అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. మణిరత్నం-సాయి పల్లవి కాంబోలో కొత్త మూవీ..హీరోపై ఆసక్తికర టాక్!

Amruth kumar
కోలీవుడ్ వెండితెరపై అద్భుత దృశ్యాలను ఆవిష్కరించే లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం, తన మార్క్ ‘క్లాస్’ మేకింగ్‌కు ‘మాస్’ క్రేజ్ ఉన్న నటులను తోడు చేసి సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. గతంలో ఎప్పుడో సాయి పల్లవి నటనకు ఫిదా అయి, "నీతో ఖచ్చితంగా సినిమా చేస్తాను" అని ఆమెకు ప్రామిస్ చేసిన మణిరత్నం.. ఇప్పుడు ఉగాది పర్వదినం సందర్భంగా ఆ మాటను నిలబెట్టుకుంటూ తన కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేశారు.



మణిరత్నం తన సొంత బ్యానర్ ‘మద్రాస్ టాకీస్’పై నిర్మిస్తున్న 23వ చిత్రమిది. ఇందులో హీరోగా వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి నటిస్తుండగా, హీరోయిన్‌గా గ్లోబల్ లెవల్ క్రేజ్ ఉన్న సాయి పల్లవి ఫిక్స్ అయ్యారు.సాయి పల్లవి టాలెంట్‌ను గుర్తించి ఆమెకు అవకాశం ఇస్తానని చెప్పిన మాటను మణిరత్నం నిలబెట్టుకోవడం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.గతంలో ‘నవాబ్’ (చెక్క చివంత వానం) సినిమాలో విజయ్ సేతుపతితో కలిసి పనిచేసిన మణిరత్నం, ఇప్పుడు మరోసారి ఆయనలోని నటుడిని కొత్తగా చూపించబోతున్నారు.



మణిరత్నం కెరీర్‌లో ఇటీవల ‘థగ్ లైఫ్’ సినిమా ఒక పెద్ద మచ్చగా మిగిలిపోయింది. కమల్ హాసన్, శింబు వంటి స్టార్స్ ఉన్నా ఆ సినిమా ఘోరంగా ఫ్లాప్ అవ్వడమే కాకుండా, వివాదాల వల్ల చాలా చోట్ల రిలీజ్ కూడా కాలేదు.‘పొన్నియన్ సెల్వన్’ పార్ట్ 1 & 2 లతో బాక్సాఫీస్ దగ్గర వేల కోట్లు కొల్లగొట్టిన మణిరత్నం.. ఇప్పుడు విజయ్ సేతుపతి, సాయి పల్లవి సినిమాతో మళ్ళీ తన ఫామ్‌లోకి రావాలని కసితో ఉన్నారు. ప్రస్తుతం రణబీర్ కపూర్ సరసన ‘రామాయణం’లో సీతగా నటిస్తూ బిజీగా ఉన్న సాయి పల్లవి, ఆ ప్రాజెక్ట్ అవ్వగానే మణిరత్నం సెట్స్‌లో జాయిన్ కానుంది.మణిరత్నం సినిమా ప్రకటన రావడంతో సౌత్ సినిమా ఇండస్ట్రీ మొత్తం షేక్ అవుతోంది.పర్ఫార్మెన్స్ బాక్సాఫీస్ దగ్గర మణిరత్నం తన క్లాసిక్ టచ్‌తో మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అయ్యారు.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: