చిన్నారి విషయంలో మాట నిలబెట్టుకున్న విరోష్ జంట.. వీడియో వైరల్..!

Divya
స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక  ఫిబ్రవరి 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇరువురి కుటుంబ సభ్యుల, సన్నిహితులు ,స్నేహితుల సమక్షంలో రాజస్థాన్లోని ఉదయపూర్ లో వీరి వివాహం జరిగింది. వివాహం అనంతరం కూడా బిజీబిజీగా గడిపేస్తున్న ఈ దంపతులు దేశవ్యాప్తంగా రష్మిక, విజయ్  టీమ్ పలుచోట్ల స్వీట్ల పంపిణీ చేయడమే కాకుండా ప్రత్యేకించి కొన్ని దేవాలయాల వద్ద అన్నదాన కార్యక్రమాలను కూడా చేశారు. రష్మిక ,విజయ్ రిసెప్షన్ కూడా చాలా గ్రాండ్ గానే జరిగింది.


అటువంటి సందర్భంలోనే రష్మిక ,విజయ్ పెళ్లికి తనను ఎందుకు పిలవలేదంటూ ఒక చిన్నారి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. తన ముద్దు ముద్దు మాటలతో అడిగిన ప్రశ్నలు అటు విజయ్ దేవరకొండ, రష్మిక ను ఆకట్టుకున్నాయి.. చిన్నారి ఆ వీడియోలో మాట్లాడుతూ.." మరి మీ పెళ్లికి నన్ను ఎందుకు పిలవలేదు !అందరికీ లడ్డూలు ఇస్తున్నారు అన్నదానం చేస్తున్నారు. మేము కూడా మీకోసం సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నాం కదా! మమ్మల్ని పిలిస్తే ఏమవుతుందంట? అంటూ ఒక వీడియో షేర్ చేయగా ఆ వీడియో రష్మిక ,విజయ్ కంటపడింది.


దీంతో ఈ వీడియో వైరల్ గా మారడంతో విరోష్ జంట ఆ పాపను కలుస్తామంటూ మాట ఇచ్చారు. దీంతో ఎట్టకేలకు తాజాగా ఆ చిన్నారిని ఇంటికి పిలిపించి మరి స్వయంగా తమ చేతులతో భోజనాన్ని ఆ చిన్నారికి వడ్డించారు ఈ జంట. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారడంతో భోజనం తర్వాత చిన్నారితో  విజయ్ ,రష్మిక ముచ్చటించినట్లు కనిపిస్తోంది. ఆ చిన్నారి క్యూట్ మాటలకు విజయ్ ,రష్మిక సైతం తెగ సంబరపడిపోయి మరి నవ్వుతున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన పలువురు అభిమానులు, నేటిజన్స్ సైతం విరోష్ జంట పైన ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: