డిప్యూటీ సీఎంగా బాధ్యతలు.. అయినా పవన్ సినిమా జోష్ తగ్గదు!

Amruth kumar
ఏపీ రాజకీయాల్లో కింగ్ మేకర్‌గా, డిప్యూటీ సీఎంగా జనాల్లో ‘ప్రభంజనం’ సృష్టిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అటు వెండితెరపై కూడా అదే ‘రాకెట్’ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. రాజకీయ బాధ్యతలు నిర్వహిస్తూనే, సినిమాలను బ్యాలెన్స్ చేస్తున్న ఆయన ప్లానింగ్ చూసి టాలీవుడ్ వర్గాలు షాక్ అవుతున్నాయి. తాజాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (మార్చి 19 రిలీజ్) తో బాక్సాఫీస్ దగ్గర మంటలు పుట్టిస్తున్న పవన్, తన తదుపరి చిత్రాల కోసం ఒక టెర్రిఫిక్ ‘45 డేస్’ స్ట్రాటజీని సిద్ధం చేశారు.



చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, పవన్ కళ్యాణ్ కాంబో మూవీ ఇప్పుడు పట్టాలెక్కడానికి రెడీ అయింది. రామ్ తాళ్లూరి భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ కేవలం 40 నుంచి 45 రోజుల కాల్షీట్లు మాత్రమే కేటాయించారట. ఆ తక్కువ టైమ్‌లోనే పవర్ స్టార్ పోర్షన్‌ను కంప్లీట్ చేసేలా సురేందర్ రెడ్డి ఒక ‘పక్కా’ మాస్ స్కెచ్ వేస్తున్నారు.సురేందర్ రెడ్డి స్టైలిష్ మేకింగ్‌కు పవన్ కళ్యాణ్ స్వాగ్ తోడైతే థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ!



మరో క్రేజీ అప్‌డేట్ ఏంటంటే.. ‘గాడ్‌ఫాదర్’ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో పవన్ ఒక భారీ యాక్షన్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇందులో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ అత్యంత శక్తివంతంగా ఉండబోతోందని, క్యారెక్టర్‌నే నమ్ముకుని సాగే కథ ఇదని ఇన్ సైడ్ టాక్. ‘బ్రో’ లాంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మళ్ళీ పవన్ కళ్యాణ్‌తో ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించడానికి సిద్ధమవుతోంది. దీనికి కూడా పవన్ 45 రోజుల సమయమే ఇచ్చే ఆలోచనలో ఉన్నారట.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ‘ఉస్తాద్’ విజయాన్ని ఎంజాయ్ చేస్తూనే, నెక్స్ట్ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: