విడాకులపై అసలు విషయం బయటపెట్టిన మెగా డాటర్..!
ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన ఏవి కలిసి రాలేదు. కానీ నిర్మాతగా మాత్రం మంచి గుర్తింపు సంపాదించుకుంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్ బ్యానర్ పైన పలు రకాల సినిమాలను నిర్మిస్తోంది నిహారిక. సంగీత్ శోభన్ ప్రధానపాత్రలో నటించిన రాకాస చిత్రం ఏప్రిల్ మూడవ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక అందులో ఈ సినిమా గురించి పలు విషయాలను పంచుకోవడమే కాకుండా తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది.
ముఖ్యంగా తన వివాహం, విడాకుల గురించి చెప్పుకొచ్చింది. జొన్నలగడ్డ చైతన్య ను నిహారిక వివాహం చేసుకోగా, వీరి వివాహం పెద్దలు కుదిర్చిన వివాహం కాబట్టి చాలా గ్రాండ్గా జరిగింది. ఆ తర్వాత వీరు ఒక ఏడాదిపాటు కలిసి ఉన్నారు. పరస్పర అంగీకారంతోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు ఇప్పటికీ మూడు సంవత్సరాలు అవుతోంది. విడాకులు నిర్ణయం మొదట ఎవరికి చెప్పారు అనే ప్రశ్న ఎదురవగా? ఈ విషయంపై తానే నిర్ణయం తీసుకున్నాక తన తండ్రికి చెప్పానని ,ఆయన ఈ విషయం విని సైలెంట్ అయ్యారు. వివాహం తర్వాత కూడా వారు చాలా గౌరవించారు. నేను ఆనందంగా లేననే విషయం వారికి తెలుసు దీంతో మా నాన్న నువ్వు ఇబ్బందిగా జీవితాన్ని కొనసాగించాల్సిన పనిలేదు విడాకులు తీసుకొని ఆనందంగా ఉందంటూ చెప్పారని ఆ తర్వాత నేను నా భర్త ఇద్దరం కలిసి పరస్పర అంగీకారంతోనే విడిపోయామని తెలియజేసింది.