టాటూ వేనుక అసలు విషయం బయటపెట్టిన నటి జ్యోతి..!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటి జ్యోతి ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను బాగా అలరించింది. పెళ్ళాంఊరెళితే సినిమాలో ఒక విభిన్నమైన పాత్రలో నటించి బాగా గుర్తింపు సంపాదించుకున్న జ్యోతి , ఇండస్ట్రీలో జరిగేటువంటి విషయాలపైన సరే నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను తెలియజేస్తుంది. ఒక పాత్రను ఎంపిక చేసుకోవడం (బోల్డ్ పాత్రలు) అనేది కేవలం నటీనటుల ప్రతిభ పైన ఆధారపడి ఉంటుంది. వారు చేయాలా వద్దా అనే విషయం కూడా వారి చేతిలోనే ఉంటుందని తెలియజేసింది.



ముఖ్యంగా తాను ఎక్కువగా బోల్డ్ పాత్రలలోనే నటించే విషయంపై మాట్లాడుతూ.. తనకు నచ్చిందే చేస్తానని నచ్చకపోతే అసలు చేయనని తెలియజేసింది. ఈ స్వభావం వల్ల కొన్ని అవకాశాలు కూడా తాను కోల్పోయానని, తన నిజాయితీ ముక్కుసూటితనం వల్ల కొంతమంది భయపడి తన పాత్రలను వివరించడానికి కూడా చాలామంది వెనుకడుగు వేసే వారిని తెలిపింది. ముఖ్యంగా అమ్మాయిలు ధైర్యంగా బలంగా ఉండాలని మీరు మీ కోసం నిలబడకపోతే ప్రజలు మీ బలహీనతను ఉపయోగించుకుంటారని అమ్మాయిలకు సలహా ఇచ్చింది.


ఇక తన వ్యక్తిగత విషయానికి వస్తే ఆమె తన మెడలో ఉన్న ఈవిల్ ఐ లాకెట్ గురించి అలాగే తాను వేయించుకున్న టాటూ గురించి మాట్లాడుతూ ఇది సీతాకోకచిలుక టాటూ అని అలాగే పువ్వు డిజైన్ తో కూడిందని తెలిపింది. మొదట ఫ్యాషన్ కోసం వేయించుకున్నప్పటికీ ఆ తర్వాత కలర్ఫుల్ జీవితం, స్వేచ్ఛగా ఎగిరే స్వభావం వంటి అర్థాలు ఉన్నాయని తెలుసుకున్నానని తెలిపింది. లాకెట్ కేవలం ఫ్యాషన్ కోసమే వేసుకున్నానని తెలిపింది..అలాగే తనకి ఒక కుమారుడు ఉన్నారని గత అనుభవాల వల్ల ప్రేమను నమ్మడానికి తాను ప్రస్తుతం సిద్ధంగా లేనని, ఈ దశలో ప్రేమను నమ్మడానికి తనకి సరిపోయేంత ధైర్యం లేదని, ఒకవేళ ఈసారి వచ్చేవాడు మంచివాడు అయినా వాడిని నమ్మే పరిస్థితిలో తాను లేనని తెలియజేసింది నటి జ్యోతి. ప్రస్తుత జ్యోతి చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: