సింగపూర్ లో హీరోయిన్ తో నాగార్జున ఎఫైర్.. నాకన్నీ తెలుసంటూ అమల ఎమోషనల్.!

Pandrala Sravanthi
అక్కినేని నాగార్జున అమల ల ప్రేమ బంధం ఈనాటిది కాదు. వీరి పెళ్లై 34 ఏళ్లు అయినా కూడా ఇంకా వీరి మధ్య ఎంతో మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది.ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు చిన్న చిన్న విషయాలకే విడాకులు తీసుకుంటూ ఉంటే నాగార్జున అమల మాత్రం చాలా మంచి అండర్స్టాండింగ్ తో 34 ఏళ్లు సక్సెస్ ఫుల్ గా తమ వైవాహిక బంధాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఓ ఇంటర్వ్యూలో నాగార్జున గురించి వచ్చిన వార్తల గురించి అమల స్పందిస్తూ ఎమోషనల్ అయింది.అయితే నాగార్జునకి టబుకి మధ్య ఉన్న రిలేషన్ గురించి సోషల్ మీడియాలో ఇప్పటికీ ఎన్నో వార్తలు వినిపిస్తూ ఉంటాయి. 


ఈ నేపథ్యంలోనే నాగార్జునకి ఉన్న ఎఫైర్స్ ఆయన పై వచ్చిన ఫేక్ వార్తల గురించి అమల ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. గతంలో ఓ జర్నలిస్టు నాగార్జున ఓ హీరోయిన్ తో పబ్ కి వెళ్లారని రాశారు. కానీ విచిత్రం ఏమిటంటే నాగార్జునతో పబ్ లో ఉన్న ఆ హీరోయిన్ ని నేనే..ఆ సమయంలో నాకు ఆ వార్త చదివి నవ్వొచ్చింది. ఇక ఆ మధ్య నేను నాగార్జున కలిసి సింగపూర్ కి వెళ్ళాం. అయితే ఆ టైంలో నేను గుండు కొట్టించుకున్నాను. దాంతో నన్ను గుర్తుపట్టని తమిళ అభిమాని మీకు పెళ్లయింది.. అయినా వేరే అమ్మాయితో తిరుగుతున్నారు అంటూ నాగార్జునని పట్టుకొని అడిగారు. దానికి నాగార్జున ఈవిడని సరిగ్గా చూడండి. నేను వేరే అమ్మాయితో తిరగడం లేదు.


ఈవిడ నా భార్య అమలనే అంటూ సర్ది చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు నాగార్జునకి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. అనుమానం ఉంటే అక్కడ ప్రేమ ఉండదు. ఆయనపై ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ నాకు ఆయనపై ఎక్కడా కూడా అనుమానం లేదు. ఆయన మీద ఉన్న ప్రేమ ముందు అనుమానం నిలవదు. వైవాహిక బంధం లో ఒకరిపై ఒకరికి నమ్మకం లేకుంటే అసలు ఆ బంధం నిలబడదు. నాకు నాగార్జున పై పూర్తి నమ్మకం ఉంది అంటూ నాగార్జున పై ఫేక్ వార్తలు క్రియేట్ చేసే వారికి అమల గట్టి కౌంటర్ ఇచ్చింది. అయితే ఈ విషయాలన్నీ అమల ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో బయటపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: