తెలుగు ఆడియన్స్ మనసును డీప్ గా హర్ట్ చేసిన ధురంధర్ 2..ఇలా ఎలా చేయగలరు..?
అయితే, ఈ అపార విజయోత్సాహం మధ్య తెలుగు ప్రేక్షకుల నుంచి కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సాధారణంగా ఇతర భాషా చిత్రాలను కూడా ఎంతో ఆదరిస్తూ, వాటిని థియేటర్లలో విజయవంతం చేసే తెలుగు ఆడియన్స్, ఈసారి మాత్రం సినిమా తెలుగు డబ్బింగ్ విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రణవీర్ సింగ్ పాత్రకు ఇచ్చిన డబ్బింగ్ వాయిస్ సరైన రీతిలో సెట్ కాలేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. వాయిస్ టోన్ పాత్రకు తగినంత గంభీరతను ఇవ్వలేదని, డైలాగ్ డెలివరీలో స్పష్టత కొరవడిందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కొంతమంది ప్రేక్షకులు అయితే, సినిమా మొదటి భాగంతో పోలిస్తే ఈ భాగంలో డబ్బింగ్ నాణ్యత స్పష్టంగా తగ్గిందని పేర్కొంటున్నారు. ఇది సినిమా అనుభవాన్ని కొంత మేరకు ప్రభావితం చేస్తోందని, ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో భావోద్వేగాలను పూర్తిగా అందించలేకపోతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. థియేట్రికల్ విడుదలలో ఈ సమస్యను సరిచేయడం సాధ్యపడకపోయినా, త్వరలో విడుదల కానున్న ఓటీటీ వెర్షన్‌లో మాత్రం మార్పులు చేయాలని అభిమానులు కోరుతున్నారు.
ఈ చిత్రం మే 22న జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్‌కు రానున్న నేపథ్యంలో, అప్పటివరకు డబ్బింగ్ క్వాలిటీపై మరింత శ్రద్ధ పెట్టి, ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సరిదిద్దాలని మేకర్స్‌ను సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికి, ఒకవైపు రికార్డు స్థాయి విజయాన్ని అందుకుంటున్న ఈ చిత్రం, మరోవైపు డబ్బింగ్ అంశంపై వచ్చిన విమర్శలతో చర్చనీయాంశంగా మారింది. నిర్మాతలు ఈ ఫీడ్‌బ్యాక్‌ను పరిగణలోకి తీసుకుని ఓటీటీ వెర్షన్‌లో మార్పులు చేస్తే, సినిమా మరింత విస్తృతంగా ప్రేక్షకాదరణ పొందే అవకాశాలు ఉన్నాయి.