సౌత్ స్టార్‌లపై ప్రకాశ్ రాజ్ తీవ్ర అసహనం..!
ఈ సినిమా చూసిన తర్వాత మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ మరియు ఎస్ఎస్ రాజమౌళి వంటి దక్షిణాది దిగ్గజాలు సోషల్ మీడియాలో ఆదిత్య ధర్ అండ్ టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.ఒక నెటిజన్ "సౌత్ స్టార్స్ పొగుడుతున్నారు కానీ, బాలీవుడ్ స్టార్స్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు?" అని అడిగిన ప్రశ్నకు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ..(కృతజ్ఞత లేదా మొహమాటపు బాధ్యతలు దక్షిణాదికి కూడా వ్యాపిస్తున్నాయి) అంటూ ఘాటుగా సమాధానమిచ్చారు. దీనికి తోడు ఆయన "నేను ధురంధర్‌కు చాలా దూరంగా ఉన్నాను" అంటూ ఒక పాత పాటను ప్లే చేస్తున్న వీడియోను కూడా షేర్ చేశారు. ఇది పరోక్షంగా సినిమాలోని ‘ప్రొపగాండా’ అంశాలను ఉద్దేశించి చేసిన కామెంట్ అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
ప్రకాష్ రాజ్ విమర్శలు ఎలా ఉన్నా, బాక్సాఫీస్ నంబర్లు మాత్రం ‘వైల్డ్’గా ఉన్నాయి.ఈ సినిమా ఒక్క నార్త్ అమెరికాలోనే దాదాపు $10 మిలియన్ల వసూళ్లతో అదరగొడుతోంది. ఇది ‘బాహుబలి 2’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాల పేస్ కంటే వేగంగా ఉండటం విశేషం.షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ పేరిట ఉన్న రికార్డులను చెరిపేస్తూ, హిందీ చిత్ర పరిశ్రమలో బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ సాధించిన సినిమాగా నిలిచింది. రణవీర్ సింగ్ తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని, ఆదిత్య ధర్ మేకింగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఉందని విమర్శకులు సైతం మెచ్చుకుంటున్నారు.‘ధురంధర్ 2’ వివాదం మాత్రం నేషనల్ లెవల్‌లో హాట్ టాపిక్ అయ్యింది.